U S లివర్ మోర్ టెంపుల్
రచన : శర్మ జీ ఎస్
సహజంగా దేవుణ్ణి పూజించటానికి గాని , దేవాలయాలను సందర్శించటానికి గాని పలు కారణాలు అంతర్గతంగా ఉండవచ్చు , పైకి మాత్రం ఐదు కారణాలు స్పష్టంగా కనప్డ్తుంటాయి .
మొదటిది : భక్తి .
ఎక్కువగా యిది వయసు మళ్ళిన వాళ్ళకు వర్తిస్తుంటుంది . జన్మను తరింప చేస్తుందన్న తపనతో యిలా గుళ్ళు , గోపురాలను దర్శిస్తుంటారు .
రెండవది : భయం .
ఇది కొంతమంది పెద్దవాళ్ళకు , ఇంకా అక్రమ సంపాదన వశులైనావాళ్ళకు వర్తిస్తుంది . ఈ జీవితాన్ని చక్కగ వెళ్ళ
బుచ్చేటందులకై ఆ దేవుడనబడే ఆకారాన్ని భయంతో పూజించి , జీవితాన్ని చక్కగ వెళ్ళదీయమని చేసే చిన్న క్లాసికల్ మనవి , కొంచెం మనం సమర్పించుకొనే అదో రకమైన లంచాలతో .
మూడవది : గౌరవం / భయం .
దేవుడు , దేవతల మీద భక్తి కాదు , భయమూ కానిది . పెద్దలంటే గౌరవం / భయం కలిగినది . ఇది చిన్నపిల్లలకు వర్తిస్తుంది .
నాల్గవది : తపన .
రంగు రంగుల పడుచులను చక్కగా పైసా ఖర్చు లేకుండా చూసుకోవచ్చు , అవకాశం దొరికితే ఓ ట్రయల్ వేద్దాం అన్న చిన్న చిరు ఆశతో వెళ్ళే కుఱ్ఱకారుకి వర్తిస్తుంది .
ఐదవది : మూఢభక్తి .
మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు , వాళ్ళు ఆచరిస్తున్నారు . మనమూ ఆచరిద్దాం , ఏదైనా వస్తే వస్తుంది , రాలేదా నష్టమేమీ లేదు అనుకొని అటుగా అడుగులు వేసే వాళ్ళకు వర్తిస్తుంది .
ఈ రోజు 10.40.కి రెంటల్ కారులో లివర్ మోర్ టెంపుల్ చూడటానికి బయలుదేరాము . ఆఖరికి అనుకున్న దాని
కంటే అర్ధగంట ఆలస్యంగా 1232 , యారో హెడ్ లో నున్న ఆ లివర్ మోర్ టెంపుల్ కి చేరుకొన్నాము .
ఆ ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశిస్తుంటే రకరకాల వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి నలువైపులా . పార్క్ చేయటానికి ప్లేస్ దొరకక , 5 నిముషాల పిమ్మట ఖాళీ అయిన ప్లేసులో పార్క్ చేశాము .
అలా ఆ కారులు బారులు తీరి పార్కింగ్లో ఉండటం చూస్తుంటే , మన భారతీయులు ఇక్కడ కింగుల్లా వెలిగిపోతున్నా
రన్నట్లు అర్ధమవుతుంటుంది . ఇలా ఈ అమెరికాలో ఎక్కడికక్కడ వాళ్ళకు కావలసిన విధంగా కింగ్ డంలు ఏర్పాటు చేస్తున్నారు , అసలు దేవుడే లేడు , విగ్రహారాధన లేదు అన్నది వారి ప్రధమ బలీయమైన భావం . జీవుడే దేవుడు / దేవత అన్నదే వాళ్ళ అసలు సూత్రం . ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవించవచ్చు , ఎంతవరకంటే , ఎదుటి
వారి స్వేఛ్ఛ కక్షలోనికి నువ్వు ప్రవేశించనంతవరకు అన్నదే .అందుకే ఇలా ఏర్పాటు చేయడానికి అమెరికా ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టదు . ఎందుకంటే వాళ్ళ ప్రధమ నిబంధనే దానికి మూల కారణం .
ఆ తర్వాత లోపలకి వెళ్ళాము . అక్కడనుండి కాలిబాటన సరాసరి వెళ్ళి ఎడమవైపు తిరగగానే పాదరక్షలు భద్ర
పరిచే గది ఆఫీసు , ఆ ప్రక్కనే రెస్ట్ రూంస్ , వీటికెదురుగా సంస్కృత పాఠశాల , ఆ ప్రక్కన ప్రసాదము కౌంటరు .
ఆ కౌంటర్ నుంచి బైటకు వచ్చి ఎడమ వైపున కాలి బాటన వెళ్తూ , ఆ కంపౌండ్ వాల్ దాటగానే కార్లదారి దాతగానే కుడి , ఎడం,అన రెండు రెండు ట్యాపులు క్రిందగా ఉంటాయి . అక్కద పాద , కర ప్రక్షాళనం కావించుకొని , ఎడమ వైపుగా వున్న 2 సింహద్వారాల గుండా లోపలకి ప్రవేశించగానే , కుడి వైపున విషయ విచారణాధికారి ఉంటాడు . ఎడమ వైపున చిన్న చిన్న విగ్రహాలతో దేవతా విగ్రహాలు ఉంటాయి .
ఆలయానికి నడుమ వినాయకుడు , శివుడు , పార్వతి , శ్రీదేవి ( లక్ష్మి ) , బాలాజి ( విష్ణు ) , కనకదుర్గ మరియు
అయ్యప్ప స్వామి యిలా దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి . అభిషేకములు , అర్చనలు , భజనలు ఒక వైపు , ఆ వెనుక భవంతి( ఫంక్షన్ హాలు ) లో . ఈ ఫంక్షను హాలుకి ఈ ఆలయానికి నడుమ ఓపెన్ హాలు . అక్కడ రైట్ సైడ్ డిన్నర్ చేసేటందుకు వీలుగా టేబుల్స్ , లెఫ్ట్ సైడ్ ప్రసాదాల టేబుల్స్ ప్రసాదాల ట్రేలతో నిండి , డిస్పోజబుల్ ప్లేట్లు , స్పూన్స్ కార్టన్లతో నిండి ఉంటాయి . ఎవరైనా , ఏదైనా ప్రసాదం చేసుకువచ్చి అక్కడ ( ఈ చేసుకొచ్చిన ) వాళ్ళే , ఆ దేవి విగ్రహం ఎదుట నైవేద్యం పెట్టి , ఆ ప్రసాదాన్ని తాము కొంత తీసుకుని , మిగిలినది అక్కడ ప్రసాదాల కౌంటరు వద్ద టెబుల్ వద్ద ఉంచిపోవాలి . ఆ తర్వాత బారులు తీరిన భక్తులు వాళ్ళు వాళ్ళ డిస్పోజబుల్ ప్లేట్లలో పెట్టుకొని ఆరగిస్తుంటారు .దానికి కుడివైపుగా ఒక లైనులో బారులు తీరిన భక్తులు ప్రసాదాలకై నిరీక్షిస్తుంటారు . ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రసాదాల వద్దకు వచ్చి డిస్పోజబుల్ ప్లేట్లు , స్పూన్ తీసుకొని వాళ్ళంతట వాళ్ళే పెట్టుకొని అవతలకి వెళ్ళి ఆరగిస్తారు కావలసినంత . కొంతమంది ఆ ప్రసాదాన్నే , సాదంగా ఆరగిస్తుంటారు . అదమాయించి , అడ్డం చెప్పే
వాళ్ళు ఎవరూ వుండరు . అలా ఆ ప్రసాదం సద్వినియోగమవుతుందని ఆనందపడ్తారు , వృధా కాకుండా .ఇదే ప్రదేశంలో గోడ ప్రక్కగా వాష్ బేసిన్స్ , డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ తో రెడిగా ఉంటాయి . వీటికి కొంచెం దూరంలో ఎడమ వైపు 2 డస్ట్ బిన్స్ ఎప్పుడూ నింపించుకోవటానికి రెడీ చేయబడి ఉంటాయి .
కళ్యాణమండపం కూడా చక్కటి వసతులతో ఉన్నది . ఎవరిదో తమిళ వాళ్ళ తిరుమణం ( కళ్యాణం ) జరుగు
తున్నది .
ఈ దేవాలయాలు అందర్ని కలపటానికి ఉపయోగపడ్టాయి అన్నది మనం గ్రహించుకొంటే చాలా మంచిది .
కనుక ఎవరు ఎలా ఆ సర్వ సద్గుణశక్తిని ఆహ్వానిస్తారో ఎవరికి వారే నిర్ణయించుకొంటే తదనుగుణంగా సత్ఫలితాల్ని అందుకోగలరు .
********
యద్భావం తద్భవతిః
ReplyDeleteఆయ .
Deleteలివర్ మోల్ టెంపుల్ చూసిన అనుభూతి కల్గించింది మీ వర్ణన..అక్కడ ప్రసాదం పధ్ధతులు బాగున్నాయి..మీరన్నట్లు ఏ భక్తితో వెళ్ళినా , భక్తి లేకుండా వెళ్ళినా,మనసుకి ప్రశాంతత, ఏదో భరోశా,తెలీని ఆత్మానందం దొరుకుతుంది..
ReplyDeleteఆ ఆలోచనతోనే వ్రాయటం జరిగింది . కృతజ్ఞతలు .
Deleteచూసిన అనుభూతి కల్గించింది.
ReplyDeleteకృతజ్ఞతలు .
Deleteమీరు బ్లాగ్ వరల్డ్ లో జాయినవ్వండి. విసృతమైన ప్రచారం మీ బ్లాగుకు కల్పించుకోండి.
ReplyDeletehttp://ac-blogworld.blogspot.in/