అద(ర)హో లేక్ తాహో


                                                                                       అద(ర)హో  లేక్ తాహో

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

 అద(ర)హో  లేక్ తాహో
ఈ రోజు అర్ధరాత్రి 2.30 కి లేచి వరుసగా అందరం రెడీ అయ్యాము . ఈ లోపల నా శ్రీమతి అన్నం వండేసింది , రాత్రే రెడీ చేసిన చిత్రాన్నముతో సహా అన్నీ ప్యాక్ చేసుకొని ఉదయం 5.45 కి మా రెంటల్ ఇన్నోవాలో లేక్ తాహో చూడటా
నికి బయలుదేరాము . జీ పి ఎస్ లో అడ్రెస్ ఫీడ్ చేయగానే 3.45 గంట జర్నీ అని చూప్పించింది . ఉదయాన్నే బయ
లుదేరటం వలన ఆ హైవేలో  మార్గమధ్యంలో ఒక గ్యాస్ స్టేషన్ వద్ద బ్రేక్ తీసుకున్నాము 9 గంటలకు . రెస్ట్ రూం కార్యక్రమాలు  పూర్తిచేసుకొని , బ్రేక్ ఫాస్ట్ గా తెచ్చుకొన్న చిత్రాన్నాన్ని అందరం ఆరగించాము .

ఈ లేక్ తాహో కొండల పైన ఉండటం వలన , ఏపుగా పెరిగిన వృక్షరాజాలు , లోతైన లోయలు అందంగా దర్శనమి
స్తూ ఆనందాన్ని  అందచేస్తున్నాయి . ఆ సరికే భాస్కరుడు ప్రకాశాన్ని మాత్రమే అందిస్తున్నాడు . ఆ బ్రేక్ 45 నిము                  షాలు తీసుకోవటం జరిగింది . మరల గమ్యం వైపు బయలుదేరాము . 10.25 గంటలకి లేక్ తాహో చేరుకొన్నాము . మేము అనుకొన్న హెవెన్లీ విలేజ్ హోటల్ అండర్ రిపేరులో వుండటంతో వెహికిల్ పార్కింగ్ కొరకు ఓ గంట వెతకా
ల్సొచ్చి ముందు ఆ పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు వద్ద షాప్ ప్రక్కన ఖాళీ స్థలంలో ( వాళ్ళ అనుమతితోనే ) పార్క్ చేసి మా అబ్బాయి విచారణ చేయటానికి వెళ్ళాడు .

లేక్ తాహోలో సైకిలిస్ట్ లు
లేక్ తాహోలో సైకిలిస్ట్ లు
ఇక్కడ అంటే ఈ అమెరికాలో  చాలామంది ఆడ , మగ అందరు సైకిలింగ్ ఎక్కువగా చేస్తుంటారు బాగా డబ్బున్న వాళ్ళు కూడా . అది వ్యాయామం లా భావిస్తారు , అవమానంగా కాని , పేదరికంగా గాని భావించరు . ఈ సైకిలింగ్  కి వయ్ససు తార
తమ్యాలు లేవు . ఆ సైకిళ్ళు చూస్తుంటే ఎంత సింపుల్ గా ఉన్నాయో , అంతకన్నింతలు వేగంగా వెళ్తుంటాయి . పటిష్టంగానూ వుంటాయి . ఆ దారులు అంతకంటే అందం గానూ వుంటాయి .
ఒక అర్ధ గంటలో మావాడు వచ్చి గొండోలా సైట్ సీయింగ్ ఇపుడు ఆపేశారుట 14 జూన్ వరకు . మనం ఇంకో వైపుకు వెళ్ళి అక్కడ ట్రై  చేద్దామన్నాడు . మళ్ళీ బయలుదేరాము అటు రివా గ్రిల్ వద్దకు .

రివా గ్రిల్
ఈ వచ్చే మార్గమధ్యంలో చాలామంది ఎక్కడెక్కడనుంచో వాళ్ళ వాహనాలలో అక్కడకు వచ్చి , వాహనాలను పార్క్ చేసి , ఆ పక్కనే వున్న ఒక ఆఫీసుకాని ఆఫీసు ముందు బారులు తీరి నుల్చొన్నారు . ఏమిటా ? అని చూస్తుంటే , కొంతమంది విచిత్ర వేషధారణతో బయటకు వస్తున్నారు . వాళ్ళను చూస్తే ఒక్కమారు కొన్ని వేల ఏళ్ళ సంవత్సరా
లు వెనుక జీవించిన వాళ్ళ జీవనశైలి చూస్తున్నామనిపిస్తుంది .

గత జన్మల నమ్మకం వాళ్ళకు లేకపోయినా , చరిత్రను నమ్ముతారు కనుక , ఆ వేషధారణ వేసుకొని , వాళ్ళు ఆ                
ఫీల్ రావటం కొరకు ఆ అడవుల్లో గుడారాలు వేసుకొని , రాళ్ళు పొయ్యిలా పెట్టుకొని  కట్టె పుల్లలతో , ఆ నాటి పాత్రలతో ఆహారం తయారు చేసుకొంటూ ఎంజాయ్ చేస్తున్నారు . దీనికి పేపర్లో ముందుగా యాడ్ యిస్తారుట ఈ       విచిత్ర ధారణ ఆఫీస్ వాళ్ళు .

అక్కడనుంచి అలా అక్కడకి దగ్గరలో వున్న రివా గ్రిల్ బీచ్ రెసార్ట్ వద్దకు వచ్చి వాహనం పార్కింగ్ చేశాము . ఆ సరికి మధ్యాహ్నం 12.15 అయింది . మేము తెచ్చుకొన్న అన్నం అందరం ఆ కారు పార్కింగ్ వద్దనే తినేశాము . అక్కడే వున్న ఆ లేక్ తాహో సెలయేరు ఆఫీసుకి వెళ్ళి వివరాలు కనుక్కొని వచ్చింది మా కోడలుపిల్ల . వాళ్ళు ఆ ఎలెక్ట్రిక్ బోటులో తీసుకువెళ్ళి అలా ఆ లేక్ మొత్తం తిప్పుతూ  10 నిముషాలు   పారాసైలింగ్ లో పైకి పంపించి ఆ ఆనందాలను మనకు కలిగించి 1 గంట లోపల వెనకకు తీసుకువస్తారుట . ఇక్కడ ఎలెక్ట్రిక్ బోట్స్ రెంటల్ కి  కూడా యిస్తారుట . మనంతటా మనమే ఆ సరస్సులో డ్రైవ్ చేసుకొంటూ అంతా చూసుకొంటూ ఎంజాయ్ చేసి రావచ్చు . దీనికి ఒక గంటకు 120 డాలర్లు . మనం అడిగితే గైడ్ని ( డ్రైవర్ ని )మనతో పంపుతారు . దానికి చార్జెస్ ఎక్స్ట్రాగా పే చేయాలిట . పారాసయిలింగ్ షో ఎన్ని గంటలకని అడిగితే 4 గంటలకని చెప్పారు . ఈ లోపల ఖాళీ లేదన్నారు . దానికే అడ్వాన్స్ గా బుక్ చేసుకొన్నాము . పెద్దవాళ్ళ నలుగురికి 75 డాలర్ల చొప్పున ఒక్కొక్కరికి  , చిన్న పిల్లలిద్ద
రికి 20 డాలర్ల చొప్పున ఒక్కొక్కరికి టికెట్లు తీసుకున్నాము . ఆ టికెట్లు ఇవ్వబోయేముందు మన వివరాలు పూర్తిగా అందులో పొందుపరుస్తూ , ఏమైనా ప్రమాదవశాత్తూ ప్రమాదం జరిగితే వాళ్ళ పొరపాటేమీ లేదని , ఆ బాధ్యత మనదేనని హామీ పత్రం సంతకంతో పూర్తి చేయాలి . ఆ సరికి మా లంచ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి 1.45 గంటలైంది . ఇంకా అప్పటిదాకా ఎక్కడకి పోతామని  , ఈ లోపల ఎలెక్ట్రిక్ బోట్ అద్దెకు

రెంటల్ బోట్లు యివే
తీసుకొని ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామను
కున్నాం . మా అబ్బాయే డ్రైవ్ చేశాడు . అందరం వెళ్ళి
వచ్చాము ఆ బోట్ గైడ్ కి 20 డాలర్స్ టిప్ యిచ్చి 3.30 కల్లా ఆ ఆఫీసుకి వచ్చాము .

నా శ్రీమతి పారాసైలింగ్ కి రాననటంతో , 2 అబ్జర్వేషన్ పాస్ లు తీసుకొని , 4 ప్యారాసైలింగ్ పాస్ లు 1200 అడుగుల ఎత్తుకి మనల్ని పంపుతారు ఆ ప్యారా
చ్యూట్ లో . తీసుకొని ఆ ప్యారాసైలింగ్ బోట్ వద్దకు చేరుకున్నాము . ఈ లోగా అమెరికన్ల సంస్కృతి మాకు దర్శనమిస్తూనే వున్నది .ఆ తదుపరి మేము ఆరుగురం , మరో ముగ్గురు కలసి బోట్ ఎక్కాము . ముందు వాళ్ళ ముగ్గురిని 800 అడుగుల ఎత్తుకి ప్యారాచ్యూట్ లో పంపారు .

నేను గతంలో ఎప్పుడూ పారాసెయిలింగ్ ఎక్కలేదు . ఇదే ప్రధమం . అయితే నాకు ముందు రెండు బ్యాచ్ లు వెళ్ళి రావటం చూడటంతో కొంత అవగాహన వచ్చింది , కొన్ని జాగ్రత్తలు తెలిశాయి . అందుకే మన పెద్దలు అంటుంటారు చేసైనా ఉండాలి లేక చూసైనా ఉండాలి అని . పైకి వెళ్ళిన తర్వాత మంకేమైనా యిబ్బందిగ వుంటే , మన మోకాళ్ళ
ను వెనుకకి , ముందుకి వూపితే వాళ్ళు మనల్ని అక్కడినుంచి క్రిందకు దింపుతారు . ఇది వాళ్ళకు మనమిచ్చే సంకేతం . నిజమేనని యిప్పుడు అర్ధమైంది .

ఆ తర్వాత మా కొడుకు కోడలు , పెద్ద మనుమడు , ఈ  ముగ్గురిని ఆ పారాసైలింగ్ హుక్ కి లింక్ చేసి 1200 అడుగుల ఎత్తుకి పంపారు . వాళ్ళకు కొన్ని ఫొటోలు , కొన్ని వీడియోలు తీశాను .

ఈ లోపల ఆ పారాసైలింగ్ అతను వచ్చి మీరొక్కరేనా అని మీ వెయిట్ ఎంత ? అని అడిగాడు . ఆ , నేనొక్కడినే , వెయిట్ 59 కిలోలు , మీరెవరైనా నా ప్రక్కన వస్తారా అని అడిగాను . అతను బదులివ్వకపోయేసరికి నా ఇంగ్లీష్ ఆ అమెరికన్ వాళ్ళకి అర్ధం కాలేదేమో అనుకున్నా . నాకొచ్చిన ఇంగ్లీష్ ఇండియాలో మాత్రమే అర్ధమవుతుందని అపుడే తెలుసుకున్నాను .ఈ లోగా మా కొడుకు , కోడలు , నా పెద్ద మనుమడు పై నుంచి క్రిందకు దిగారు . వాళ్ల ముగ్గురికని ఆ పారాసెయిలింగ్ కి తగిలించిన 3 హ్యాంగర్స్ హుక్ తీసి నన్ను త్వరగా రమ్మన్నాడు . ఈ లోగా మా అబ్బాయి సలహా యిచ్చాడు డాడ్ పైకి వెళ్ళటం ఆరంభమైనప్పటినుంచి , కొంచెం పైకి వెళ్ళే వరకు క్రిందకు చూడకు , కళ్ళు తిరుగుతాయి . సరేనన్నా . ఈ లోగా అతను నన్ను పిలిచి ఆ పారాసెయిలింగ్ రోప్స్ కి డైరెక్ట్ గా నన్ను హ్యాంగ్ చేశాడు .

పారాసైలింగ్ సమయంలో నేను
ఇదంతా వెంటవెంటనే జరిగింది . వేరే ఏ ఆలోచనకు అవకాశం లేకుండా . వెంటనే మెల్లగా పైకి వదిలాడు .  మెల్లగా పైకి వెళ్తుంది , క్రిందకు ఒక మారు చూసి , పైన చుట్టూరా కలయజూస్తున్నాను . నిరామయ ప్రదేశం , నిర్మలమైన ప్రదేశం , మలయ మందమారుతాలని విన్నా గతంలో . ఇక్కడ ఈ స్థాయిలో అది అనుభవించాను . ఈ లోపల మధ్య మధ్యన వాళ్ళు క్రిందనుంచి పైకి పంపించటానికి వదుల్తున్న వైర్ రోప్ శబ్దంవినపడ్తుంటుంది . ఆ హ్యాంగర్ హుక్ లేకపోవటం వలన నా రెండు చేతులను ఊర్ధ్వదిశగా వుంచి అరచేత్తో కుడి ఎడమల వున్న రోప్స్ ని పట్టుకొనటం కొంచెం యిబ్బందికరంగా వున్నది .  ఆ  రోప్స్ ఒరుసుకోవటం వలన . అలాగే పట్టుకొని అలా అలా ఆ ప్రయాణాన్ని ఆనందించాను . కొంత సమయం తర్వాత వాళ్ళు మెల్లగా క్రిందకు ఆ రోపుని క్రిందకు తీసుకోవటంతో నేను క్రింద ఉన్న బోట్ లో దిగాను . అయితే క్రిందకు దిగుతున్నప్పుడు మన కాళ్ళని పూర్తిగా చాచి వుంచాలి . అప్పుడు సుల
భంగా ఆ బోటులో దిగగలం . అలగే దిగాను . ఈ లోగా మా కొడుకు , కోడలు నాకు ఫొటోలు , వీడియో తీశారు . ఆ బోట్ డ్ర్రైవర్ కి 10 డాలర్లు టిప్ యిచ్చి అక్కడనుండి మెల్లగా వెనుతిరిగాము . ఇక్కడ " మీరు యివ్వదలుచుకొంటే ఎవరికైనా టిప్స్ యివ్వవచ్చ్హు " అన్న ప్రకటనలు పబ్లిక్ గా అక్కడక్కడా కనపడ్తూనే వుంటాయి .


                                                                                            *****************

2 comments:

  1. బాగుంది సర్...అమెరికాలో ప్రదేశాలని అత్యద్భుతంగా చూపిస్తున్నారు...లేక్ తాహో..photos చాలా బాగున్నాయి...

    ReplyDelete
    Replies
    1. నా శ్రీమతి సలహా వల్లనే ఇంత వివరంగా వ్రాయటం జరుగుతున్నది . ఈ క్రెడిట్ అంతా ఆమెకు చెందవలసినదే .

      Delete