ఫర్ నేం సేక్ 17 మైల్స్ డ్రైవ్
రచన : శర్మ జీ ఎస్
ఆ రోజు ఈ అమెరికాలో మే 25 , సమయం మధ్యాహ్నం 11.30 కి 17 మైల్స్ డ్రైవ్ కి బయలుదేరాం . ఆ సముద్ర తీర ప్రాంతంలోని 17 మైళ్ళ డ్రైవ్ లో అనేక ఆకర్షణలుంటాయి దర్శించటానికి . ( ఫర్ నేం సేక్ )పేరుకే 17 మైల్స్ డ్రైవ్ చేస్తే చాలా మైళ్ళు న్నాయి ఆ సముద్ర తీర ప్రాంతం కొండల చుట్టూరా .
ఆ రహదారికి కుడి ఎడమల పండ్ల తోటలుంటుంటాయి . ఆ తోటలు రాబోతుండగా కొన్ని చేతి వ్రాత బోర్డ్లు కనప డ్తుంటాయి . ఉచితంగా ప్రవేశించండి . మా అనుమతి అవసరం లేదు . తిన్నవారికి తిన్నంత , అందుకేమీ మేము వెల కట్టం , మీరు మీ వెంట కోసుకుని తీసుకు వెళ్ళే వాటికే వెల కడ్తాం అని . ఇలాంటి బోర్డ్లు ఉన్న తోటలు చెర్రీస్ , బాదం , జీడిపప్పు , కిస్మిస్స్ , ఆ రహదారిలో అధికంగా కనపడ్తుంటాయి .
|
చెర్రీ ఫలాలు |
|
చెర్రీ చెట్లు |
అలా వెళ్తూ చెర్రీ తోట ముందు మా వాహనం ఆపి అందరం ఆ తోటలోనికి ప్రవేశించాము . ఇది ఒక నూతనమే కాదు వినూత్న అనుభూతి మనలాంటి భారతీయులకి . ఎందుకంటే మన భార తదేశంలొ తోట గట్టు మీద నుల్చొని ఆ చెట్ల అందాలనో ,లేక ఆ ఫలాలనో వీక్షిం చనే అనుమతినీయకపోగా , ఫోండి ఫోండి అంటూ తరిమేసే అతి భయంకర మైన అధునాతన సంస్కృతి మనది . కారణం ఆ తోటలోని చెట్లకు కాచిన ఆ ఫలాలను చూస్తే ఎక్కడ వీళ్ళందరి దృష్టి ఆ చెట్లకు తగిలి పంట మంటల్లో పడి మాడిపోతుందేమోనని , లోనికి అనుమతిస్తే ఎక్కడ పంట మొత్తం కోసి నాశనం చేస్తారోనన్న భయంకరమైన భావాలే మూల కారణం .
వీళ్ళు అలా కాదు , అలా చెట్లకు కాసిన పంట వృధాగా నేలపాలు అయ్యే బదులు , తోటి మానవులు తినాలనుకు
న్నం త తృప్తిగా , తాజాగా ఆరగించి మజాతో ఆనందిస్తారని , ఆ తర్వాత వాళ్ళు తమ వెంట తీసుకు వెళ్ళాలనుకు న్నంత వాళ్ళే కావాలనుకున్నవి కోసుకుంటే , దానికి మాత్రమే వెల కడ్తామని భావించి యిలా ఆనందిస్తారు .చూశారా మనకు , వాళ్ళకు భావాలలో ఎంత తారతమ్యమో .
మేం 6 గురం , అల ఆ తోటలోనికి ప్రవేశించి , ఆ తోటంతా తిరిగి , తినాలనుకున్నంత తిని , కొన్ని కోసుకుని బయట కు వచ్చి ఆరు బయట వున్న కౌంటర్లో పే చేశాం .
ఆ తోటల పెంపకం , ఆ పై ఆ ఫలాల పంపకం , అమ్మకం ఓ వినూత్న తరహాలో అమిత అందాన్నిస్తూ కన్నుల విందు , మన మనసులకు పసందు కల్గిస్తుంటాయి .
|
వెల్లుల్లి తోట |
|
వెల్లుల్లి తోట |
ఆ ప్రక్కనే వెల్లుల్లి తోటలు ఉన్నాయి , ఆ పెంపకం చూస్తుంటే ఎంతో అందంగా వున్నది . ఆ తోటలకు వాళ్ళు అందిం చిన నీరు ఎండిపోకుండా వాళ్ళు , నల్లటి ప్లాస్టిక్ పేపర్తో ఆ తోటలో నాటిన అన్ని మొక్కలకూ కప్పి ( నేలమీద ఉండే లా ,కొంచెం నేల కనపడేలా ఉంచి ) ఆ తోటకు అన్నివైపులా నీళ్ళ గొట్టాలను అమర్చి , వాటికి ఎప్పుడు నీళ్ళను అందించాలో వివరంగా ఉదయం 7 , మధ్యాహ్నం 1 , మరల సాయంత్రం 7 గంటలకు సూచిస్తారు . ఆయా వేళల్లో ఎవరి సాయం తీసుకోకుండా అవి నీళ్ళను ఆ మొక్కలకు / చెట్లకు అందిస్తాయి .
అలా ఓ 30 నిముషాలు ఆనందించి , మరల ముదుకు బయలుదేరాం .
|
స్పానిష్ టెన్నిస్ క్లబ్ |
|
స్పానిష్ టెన్నిస్ క్లబ్ |
ఆ దారిలో నున్న స్పానిష్ క్లబ్ కి చేరు కున్నాం . సహజంగా అక్కడ క్లభ్ మెంబర్స్ కి టేబుల్ టెన్నిస్ ఆడుకోవ టానికి 8 కోర్ట్లు వరకు వున్నాయి చాలా విశాలమైన వాతావరణంలో . ఆ టెన్నిస్ కోర్ట్లు ఎంతో అందంగా ఉంటా యి .కొన్ని ఇళ్ళు క్లభ్ మెంబర్స్ కి యిస్తారు . అక్కడే వున్న దుకాణం లోపలనే ఈ ఆటలకు సంబంధించిన దుస్తులు , ఆట వస్తువులు అమ్ముతారు . కావాలనుకున్న మనలాంటి వాళ్ళకు కూడా అమ్ముతారు . దానిలోనే కాఫీ , కూల్డ్రింక్స్ , స్నాక్స్ వగైరా అమ్ముతారు . ఇక్కడ సైకిల్స్ ఉచితంగా ఆ చుట్టుపక్కల చూసి రావటానికి యిస్తారు . విలాసవంతమైన జీవనశైలి వీళ్ళది . దానికొరకే సంపాదిస్తారు , జీవిస్తారు .
అక్కడనుంచి అర్ధగంట తర్వాత బీచ్ ఒడ్డుకి బయలుదేరాం . మరో 2 గంటలు ప్రయాణం చేసి అక్కడే వున్న బీచ్ ఒడ్డుకు చేరుకున్నాం . శనివారం కావటం వలన ఆ సరికే వీక్షకు లు చాలామంది ఎంజాయ్ చేయటం , వెళ్ళటం , మరల మాలా కొంతమంది రావటం జరుగుతున్నది . ఆ బీచ్ ఒడ్డు కు వెళ్ళబోయే ముందే మేం మావెంట తెచ్చుకున్న చిత్రాన్నం అందరం ఆరగించాం .
|
బీచ్ తీరాన |
ఆ తర్వాత అక్కడకి వెళ్ళి ఆ అలల జోరు చూసి ఆనందించాము . అక్కడ నుండి యింకొంచెం ముందుకు వచ్చాం .
|
బర్డ్ రాక్ |
ఇక్కడ అనేక దేశాల పక్షులు అన్నీ ఆ ఒక్క కొండమీదనే ( బర్డ్ రాక్ అంటారు ,ఆ సముద్రం మధ్యలో వున్నది ,
ఇటు వంటివి చాలా వున్నా ) వాల్తాయి . అదో ప్రత్యేకత ఆ కొండకి . ఆ దరిదాపులకు వెళ్ళగానే , మన వద్దకు కొన్ని పక్షు లు వస్తుంటాయి .
|
బర్డ్ రాక్ తీరాన |
ఉడుత వచ్చి మనముందు నుల్చ్హొని ఏమైనా పెట్టమని చూస్తుంటుంది . పల్లీలు మన అరచేతిలో పెట్టుకొని చూపిస్తే వచ్చి , చేయి పట్టుకొని ఒకటొకటిగ తింటుంది . ఆ దృశ్యం చూడ ముచ్చట వేసింది . అలాగే మిగి లిన కొన్ని పక్షులు కూడా మన చెంతకు వస్తుంటాయి వాటి ఆహారం కొరకు .
ఈ అమెరికాలో ఎక్కడికక్కడ రెష్ట్ రూం లు వుంటాయి . ఎవరికీ యిబ్బంది కలుగకుండా వుండాలని , బహిర్ ప్రదే శాన్ని భ్రష్టపరచకూడదన్న వాళ్ళ పటిష్టమైన శాసనాన్ని ఎవరూ ధిక్కరించకుండా అన్ని వసతులూ కల్గిస్తారు .
సింపుల్ గా శాసనాలు తయారుచేయటం లో చూపించే శ్రధ్ధ వాటి అమలుకు కూడా చాలా కృషి చేయాలన్నది వీళ్ళ నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాలి .
ఇదంతా కొండల ఘాట్ ఏరియా పైనే సవారి . ఇలా 400 మైళ్ళకు పైనే వుంటుంది . ఇది సముద్ర తీరప్రాంతపు పేద్ద రహదారి క్యాలిఫోర్నియా లో నంబర్ 1 .
|
ఘోష్ట్ ట్రీ |
అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడ ఘోష్ట్ ట్రీ అని వుంటుంది , 5.30 కి చేరుకొన్నాం . సముద్రపు ఒడ్డు ప్రక్కగా , అది కొన్ని వంద ల ఏళ్ళ నుంచి అలానే వున్నది , అదీ లోయలోనే వుంటుంది . ఆ ఘోష్ట్ ట్రీ ని చూసి , ఇంకొంచెం ముందుకు వెళ్ళాం . ఆ సరికి సాయంత్రం 5.30 అయింది . సూర్యుడు వెలుగులు వెదజల్లుతూనే వ్న్నాడు , ఛలి మాత్రం వెన్నులో వణు కు పుట్టిస్తున్నది గాలిని వెంట వుంచుకొని . ఈ సుందర దృశ్యాలను మరల మరల చూడాలనిపించినా , మనకు అన్ని విధాలా వీలు పడదు అన్న భావన మెదలగా , అలాగే వణుకుతూ మరికొంచెం ముందుకు వెళ్ళాం . అక్కడా కొన్ని ఫొటోలు తీసుకున్నాం అలాగే వణుకుతూ , కేశాలు ఆకాశానికెగురుతున్నా , మరల ఈ అవకాశం రాదేమోనని . ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం .
|
బిగ్ సర్ బ్రిడ్జ్ |
ఇంకొంచెం ముందుకు వెళ్ళి బిగ్ సర్ బ్రిడ్జిని చూశాం . ఇది 1932 లో నిర్మించబడింది . అక్కడనుంచి ఆ సముద్ర తీరం అతి సుందర దృశ్యం . అక్కడనుంచి మరికొంచెం ముందుకు వెళ్ళాం . వన్ వే లో వెళ్ళాల్సి వచ్చింది . ఈ బ్రిడ్జి ప్రక్కనే ఉన్న కొండను నరికి రోడ్డు విశాల కార్యక్రమం జరుగుతు న్నది . ఈ బ్రిడ్జిమీద అత్యంత ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి . అల వెళ్ళి మరి కొన్ని ఫొటోలు ఆ సుందరమైన సముద్రతీరప్రంతాన తీసుకొని తిరుగు ప్రయాణం చేయటం జరిగింది .
**********
చాలా ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఉడుత అలా తినడం ముచ్చటగా ఉంది.
ReplyDeleteThanks .
Delete