వాషింగ్టన్ DC

                                                                               
                                                                                                                                      రచన : శర్మ జీ ఎస్

మా మేనకోడలు మమ్మల్ని అనుసరించింది . ఉదయం 8.45 కి ఎడిసన్ టైం ప్రకారం బయలుదేరాము మా మేన       కోడలు చేసిన కొబ్బరి అన్నంతొ , ఇంకా యితర ఆహార సామగ్రితో  వాషింగ్టన్ కి . ఉదయం 11 గంటలకి మధ్యలో బ్రేక్ తీసుకొని 35 నిముషాల తర్వాత మళ్ళీ ప్రయాణం చేశాము .

మధ్యాహ్నం 3 గంటలకు వాషింగ్టన్ కి చేరుకున్నాము . కారు పార్కింగ్ కొరకు వెతుక్కోవలసి వచ్చింది . ఉంటానికి చాలా ఉన్నాయి , కానీ గంటకి , 2 గంటలకి పే చేయాలిట . మేము చూడాలనుకున్నది వైట్ హౌస్ , దానికి దగ్గర పార్కింగులు ఉన్నాయి గాని , అవకాశం లేక కొంచెం దూరంగా పార్కింగ్ చేసి , అందరం అలా ఫుట్ పాత్ మీద నడ చుకొంటూ 17 త్ స్ట్రీట్ లో ఉన్న వైట్ హౌస్ కి బయలుదేరాము .

అంతరాయాలు ఎలాగైనా వస్తాయన్నది మనం గ్రహించుకోవాలి . మా చిన్న మనుమడు 2 వేళ్ళు పైకెత్తాడు , వెంటనే మేము చేతులు పైకెత్తాల్సి వచ్చింది . ఆ పక్కనే వున్న బేకరీ లాంటి దాంట్లోకి వెళ్ళి ఆ రెస్ట్ రూం కార్యక్రమాలు వరుసవారీగా ముగించుకుని మళ్ళీ బయలుదేరాము . 17 త్ స్ట్రీట్ కి వెళ్ళి క్యాపిటల్ బిల్డింగ్ చూసుకొని , ఆ ప్రక్కనే వున్న వైట్ హౌస్ కి  నడచుకొంటూవెళ్ళాము .


వైట్ హౌస్
                                                                                         
నేను , నా ధర్మపత్ని 
                                                                                 





                                                   
 పేద్ద ఆవరణతో , పచ్చ పచ్చని పర్యావరణంతో , ఆ వైట్ హౌస్ పైన సెక్యూరిటీ గార్డ్స్ పహరా కాస్తుంటారు ఎల్ల వేళలా . ఆ కాంపౌండ్ వెలుపల కాప్స్ ( City Of Police / భద్రతా పోలీస్ బలగాలు ) నలువైపులా వస్తున్న జనాన్నిపరిశీలిస్తుంటారు .సందర్శకులకు యిబ్బంది కలగకుండా చూస్తుంటారు . ఆరు బయట నుంచి ఫొటో తీసుకునే వాళ్ళను అభ్యంతర పెట్టరు . అలా అక్కడ 45 నిముషాలు గడిపిన తర్వాత ఆ వైట్ హౌస్ కెదురుగా ముందున్నగార్డెన్ లోకి వెళ్ళాము . అక్కడ నుంచి వైట్ హౌస్ వ్యూ చాలా చక్కగా కనపడ్తుంది . అక్కడ వుండి కొన్ని ఫొటోలను క్లిక్ చేశాము .అక్కడే వున్నఓ స్టాట్యూ (కి) ముందు ఫొటోలు తీసుకున్నాము



అక్కడ నుండి లాన్ లో నడుచుకొంటూ వస్తుంటే , ఓ ఉడుత కనపడింది . అది ముంగిసంత వున్నది . ఇక్కడ అన్నీ అలాగే ఉంటున్నాయి .

మా చిరంజీవి అంతదూరం మీరు నడవలేరు , మీరిక్కడే వుండండి , నే  కార్ తీసుకొస్తాను అనటంతో మేము మెల్లగా వరల్ద్ బ్యాంక్ ముందు ఆగిపోయాము .

అక్కడ రోడ్ల మీద ఎక్కడా చెత్త కనపడనీయరు , ఎప్పటికప్పుడు ఎవరైనా కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలు లాంటి వగైరాల చెత్తను  చేత్తో కాదు , ఇలాంటి  పరికరంతో .



30 నిముషాల తర్వాత మావాడు తచ్చిన కారులో గబ గబా ఎక్కి ( రోడ్ల మీద పార్కింగ్  చేయకూడదు . చేస్తే టికెట్ ఇస్తారు ట్రాఫిక్ కాప్స్ . కాప్స్ అంటే సిటీ ఆఫ్ పోలీస్ అని అర్ధం ) 250 డాలర్స్ పే చేయాల్సివస్తుంది . రిటర్న్ బయలుదేరుతూ , వాషింగ్టన్ వీధులూ చూసుకోంటూ ( కారులో నుంచే ) షుమారుగా 5.30  ప్రాంతాల్లో ఎడిసన్ కి బయలుదేరి 8.45 కి బ్రేక్ తీసుకోకుండా ఇంటికి చేరుకొన్నాము .


                                                                                     ********

6 comments:

  1. మీ శ్వేతసౌధసందర్శన అనుభవం బాగుంది!

    ReplyDelete
  2. visited white house along with u :)

    ReplyDelete
    Replies
    1. మీకు ఆ భావన కలగడం నాకెంతో సంతోషకరం .

      Delete
  3. @బావుందండీ మీ పర్యటన...ఎంతయైనా పెద్దన్న కదా,మొత్తంమ్మీద ..ఆయన స్వేత సౌధాన్ని సందర్సించుకున్నారు...!!

    ReplyDelete