రచన : శర్మ జీ ఎస్
1 . కోపాన్ని కోపంగా ప్రదర్శించటం పేటెంట్ ,
ఆ కోపాన్ని నవ్వుగా మలచుకోవటం టాలెంట్ .
2 . అవకాశం (రా) లేదని ఆలోచించకు ,
అవకాశం వున్నపుడు ఆలసించకు ,
అలాగని అవకాశం కోసం ఎదురుచూడకు .
3 . ఆలోచనలతో అడుగులు వేయకు ,
ఆసుపత్రిలో పడక చేరకు .
4 . కళ్ళు తెరిస్తే కష్టాలు ఆరంభం ,
కళ్ళు మూస్తే కలల సంరంభం ,
5 . ఆయన బాగా ఉంటే ఆభరణాలడిగేదాన్ని ,
బాగా లేడు కాబట్టే ఆ భరణం అడుగుతున్నా .
అందుకున్నవారికి సందర్భాన్ని బట్టి సందేశాన్నిస్తాయి .
7 . నీతులెపుడూ వినటానికి బాగానే వుంటాయి ,
ఆచరణకు అం(దనం)త దూరంలో వుంటాయి ,
ఆహ్వానిస్తే అమృతాన్నే అందిస్తాయి ,
నిరాకరిస్తే అన్యుల ఒడిలో చేర చూస్తాయి .
8 . నీ జీవితం హ్యాపీగా , సాఫీగా సాగాలంటే ,
నిన్ను నీవే మార్చుకోవాలి ,
అంతే గాని ,
ఎదుటివారు మారాలని కోరుకోకు .
9 . చీటికి మాటికి పాట పాడమంటే మా ఆవిడ పాడదు ,
చీటీ పాట పాడమంటే అమాంతంగా పాడేస్తుంది .
10 . నీవు అనుకున్నది ఆ క్షణం నీకు ఒప్పు అనిపించవచ్చు ,
ఎదుటివారికి అదే క్షణం తప్పు అనిపించవచ్చు ,
ఆ మరు క్షణం అదే నీకూ తప్పు అనిపించవచ్చు .
( మళ్ళీ కలుసుకొందాం )
చిత్రమైనది మనసు :)
ReplyDeleteకదండి మరి .
Deleteఅన్నీ బావున్నాయండీ ముఖ్యంగా .8 నాకు .బాగా .నచ్చింది
ReplyDeleteకృతజ్నతలు .
Deleteవండర్ ఫుల్లు ..... సర్ జీ
ReplyDeleteనిజాల తో కామెడీగా కాటేశారు మరి !!
కామెడిగా కాటేశానంటూ ప్రాసతో వ్రాసేశావు .
Delete