నయాగరా ఫాల్స్

                                                                                                                                     రచన : శర్మ జీ ఎస్
                                                                                                
నయాగరా ఫాల్స్ 
నయాగరా ఫాల్స్ 










ఈ అమెరికాలోనే చాలాచోట్ల అంటే కొన్ని కొన్ని స్టేట్స్ కి టైమ్ తేడా వుంటుంటుంది . కాలిఫోర్నియాలో ఉదయం 6 గంటలైతే , న్యూయార్క్ , న్యూజెర్సీ , వాషింగ్టన్ లలో ఉదయం 9  గంటలవుతుంది .

ఈ రోజు నయాగరా ఫాల్స్ కి వెళ్ళాలనుకున్నాం . వాహనంలో బయలుదేరితే ఎడిసన్ నుంచి 6 / 7 గంటలు పడ్తుంది వితౌట్  ఎనీ బ్రేక్స్ . న్యూజెర్సీలోని ఎడిసన్ లోని మా  మేనకోడలు ఈ మధ్యనే చూసిందట . అందుకని తను రాననటంతో , మాకుటుంబం ( నేను , నా శ్రీమతి , మా కొడుకు , కోడలు , ఇద్దరు మనమళ్ళు ) వరకు భోజనాలు ముగిం చుకుని రెంటల్ ఇన్నోవాలో బయలుదేరాము 2.30 కి యిక్కడి టైం ప్రకారం  .  మా వాడు తెచ్చుకున్న టాం టాం జీ పి ఎస్ సాయినడిగి వాళ్ళ జీ పి ఎస్ స్టాండ్ కి ఫిక్స్ చేసుకొనటంతో , గైడ్ మన పక్కనే ఉండి మనము ఎటు వెళ్ళాలో చెప్తుంటే అలా .

ఏదైనా తినాలనిపించినా , లేక గ్యాస్ ( పెట్రోల్ ) ట్యాంకులో ఫిల్ చేయించుకోవాలన్నా , ఆ హైవే లో ఎక్కడికక్కడ     ఎగ్జిట్ లు గ్రీన్ కలర్ బోర్డ్లో వైట్ లో డిస్ప్లే అవుతూ దర్శనమిస్తాయి . అవి అన్నీ ఆథరైజ్ద్ వే . అన్ ఆథరైజ్ద్ గా ఒక్కటైనా ఉండనే ఉండవు  .
మ్యాక్ డొనాల్డ్ డ్రైవ్ త్రూ
ప్రతి గ్యాస్ ఫిల్లింగ్ ప్లేసుల ప్రక్కనే ఓ రెస్టారెంట్ లాంటిది ఉండి తీరుతుంది ( ఎక్కువ మ్యాక్ డొనాల్డ్ లు ఉంటుంటాయి ). ఇవి ఒక్కటే ఉన్న ప్లేసుల్లో డ్రైవ్ త్రూ కూడా ఉంటాయి , అంటే వాహనంలో నుంచి దిగకుండా అక్కడ కౌంటర్లో ఆర్డర్ చేసి అలాగే ముందుకు వెళ్ళి అవతల పే చేసి తీసుకోవటం . ఇలాంటి అరేంజ్ మెంట్స్ ఎందుకు చేశారంటే , ఇక్కడ మంచు ,చలి అధికంగా వుంటాయి . ఆ సమయంలో వాహనం లో నుంచి దిగి వచ్చి , ఇచ్చేవరకు నిరీక్షించటం         యిబ్బందికరమైన స్థితి . అందుకని యిలాంటి అరేంజ్ మెంట్స్ చేస్తారీ అమెరికాలో . కష్టమర్లు వీళ్ళకు నిజమైన  దేవుళ్ళలా భావిస్తారు ఆచరణతో , మాటలలో కాదు .

ప్రతి వస్తువు మీద ఆ వస్తువు తయారీకి సంబంధిత వివరాలు కనపడ్తుంటాయి . ఇవి మనకు డ్రైవింగ్ లో అలసట లేకుండా ఉండేటందులకు కూడా ఉపయోగపడ్తాయి ఈ ఎగ్జిట్ లు .

ఇలా ఆగటాన్ని బ్రేక్స్ అంటుంటారు . ఇలాంటి బ్రేక్స్ 3 , 4 వేసుకొంటూ  నైట్ 12 గంటలకు డేస్ ఇన్ హోటల్ కి వెళ్ళి
అక్కడ సెల్లార్లో మా వాహనం పార్కింగ్ చేసి , మా లగేజ్ తీసుకొని ఆ ప్రక్కనే వున్న లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ కి రెసెప్షన్ కౌంట ర్ కి వెళ్ళి మా రూమ్స్ కీస్ తీసుకొని మేమొక రూంలో , మా కొడుకు , కోడలు , మనుమళ్ళు మరొక రూంలో దిగా ము . ఇక్కడ చలి పులి వణికిస్తున్నది .

మా చిరంజీవి వెంటనే రూం హీటర్ ఆన్ చేశాడు . ఆ తర్వాత ఒక అర్ధగంటకి నిద్రపోయాము .ఉదయాన్నే లేచి కాల
కృత్యాలు ముగించుకొని 9 గంటలకు ఆ ప్రక్కనే వున్న నయాగరా ఫాల్స్ కి  పిల్లల్ని స్ట్రాలర్స్ లో కూర్చోపెట్టుకుని బయలుదేరాము . చల్లగాలి ఎక్కువగానే ఉన్నది .


పూలచెట్లు 


ఇక్కడ పూలచెట్లు , అదేంటి పూలచెట్లు అంటున్నా రేమిటి ? పూలమొక్కలు కదా అనవలసింది అన్న అనుమానం కలిగి వుండవచ్చు . అక్కడకే వస్తున్నా , ఇక్కడ చెట్లకి ఆకులు తక్కువ , పూలే ఎక్కువ . పెద్ద పెద్ద చెట్లకు కూడా పూలే ఉంటాయి . అలా వెళ్ళి అక్కడే వున్న క్యూలో నుల్చొని టికెట్లు తీసుకొని బోర్డ్ వాక్ కి వెళ్ళి ఎడమ వైపు నయాగరా ఫాల్స్ , కుడి 




రెయిన్ బో బ్రిడ్జ్ 
వైపు రెయిన్ బో బ్రిడ్జ్ చూసుకొని లిఫ్ట్ లో క్రిందకు వెళ్ళాము  ఆ " మేడ్ ఆఫ్ ద మిస్ట్ " బోట్ ఎక్కటాని  
కి . అచ్చటే  కొంత సమయం ఉండి ఆ దృశ్యా లను చూస్తూ , వాటిని వాటితో పాటు మమల్ని మా వెంట తెచ్చుకున్న కెమేరాలలో ఉంచాం . ఎలెక్ట్రిక్ బోటు లో 



ఆ ఫాల్స్ వరకు తీసుకువెళ్ళి చూపిస్తారు . ఆ ఎలెక్ట్రిక్ బోటు వద్దకు వెళ్ళా లంటే లిఫ్ట్ లో క్రిందకు వెళ్తే ,అక్కడ వాళ్ళు ఓ బ్లూ రెయిన్ కోట్ యిస్తారు , అది వేసుకొని వెళ్ళాలి . ఎందు కంటే ఆ వాటర్ ఫాల్స్ మనమీదపడి డ్రెస్ తడిసి పోకుండా వుండేటందులకై  .



అలా వెళ్తుండగా , దారిలో ఆ నీళ్ళలో , దొంగ జపం చేసే కొంగలు యిక్కడ జపం చేయకుండా పైనే విహరిస్తూ , వాటిని చూడటనికి పైపైకి వస్తున్న చేప పిల్లలను తమ కాళ్ళతో పట్టుకొని నోటికి కరుచుకొని ఆరగించేస్తాయి .


మేడ్ ఆఫ్ మిస్ట్ బోట్ & దొంగ జపం కొంగలు
 అలా   ఆ సుందర మనోహర దృశ్యాలను చూస్తూ , వాటిని వాటితో పాటు మమల్ని మేం తెచ్చుకున్న కెమేరాలలో ఉంచేశాం .
 ఆకాశాన్నుంచి దిగువ కొస్తున్న జలధారలు
ఆ ఆకాశం ఎక్కడుంది ? అసలు వుందా , లేదా , లేక ఆకాశమే ఈ ఉరవళ్ళ పరవళ్ళను ఇటకు పంపుతున్నదా అన్న అనుమానం కలిగిస్తుంటాయి ఆ వాటర్ ఫాల్స్ . ఆ ఉరవళ్ళు , ఆ పరవళ్ళు చూపరులను పరవశం చేస్తున్నాయి . అలా ఆ మేడ్ ఆఫ్ మిస్ట్ లో వెళ్తుంటే , ఎడమవైపు , ఎదురుగా ఆ వాటర్ ఫాల్స్ ,


మేమున్నది అమెరికా , ఆ వెనక కెనడా దేశం

 కుడివైపు పేద్ద పేద్ద స్టార్ హోటల్ బిల్డింగ్స్ , రహ దారు లు కనపడ్తుంటాయి . అది అమెరికా అను కొంటే పొర పడ్డట్లే మనం మనసుకు , కంటికి కూడాను . అది కెనడా దేశమట . వినగానే ఆశ్ఛర్యం కలిగింది . అలా చూసుకొంటూ , వెనుకకు వస్తుంటే మా ఎదురుగా రెయిన్ బో బ్రిడ్జ్ దర్శనమిస్తుంది .





రెయిన్ బో బ్రిడ్జ్ , ఇరు దేశాలకు చిరు వారధి


ఈ బ్రిడ్జ్ విశేషమేమిటంటే ఇటు అమెరికాకి , అటు కెనడాకి నడుమ వారధిగా పని చేస్తుంది . అమెరికా వాళ్ళకు , కెనడా వాళ్ళకు వీసా అవసరం లేదట , ఎపుడైనా వెళ్ళవచ్చుట ఆ బ్రిద్జ్ పైన . మిగిలిన ఏదేశస్థులకైనా వీసా చూపిం చి  తీరవలసిందే . మిగిలిన దేశస్థులు వీసా లేకుండా , అక్కడి అధికారులను తప్పించుకొని ఆ బ్రిడ్జ్ వాహనంలో దాట ప్రయత్నిస్తే , ఆ రోడ్డు పైనే వున్న కత్తులు ఆ వాహనపు టైర్లని కట్ చేసేస్తాయిట .

 ఆ తర్వాత మేం వేసుకున్న రెయిన్ కోట్స్ తీసి అక్కడే వున్న డస్ట్ బిన్స్ లో వేసి మరల లిఫ్ట్ ఎక్కి పైకి ( బోర్డ్ వాక్ )వద్దకు వచ్చి , మరల కొంత సమయం ఆ దృశ్యాలను , కెనడా దేశపు బిల్డింగ్స్ ని మాతో పాటు వాటిని కెమేరాలో క్లిక్ చేశాము . అక్కడ నుండి హోటల్ కి బయల్దేరాం . మేం వెంట తెచ్చుకున్న అల్పాహారాలను , ఆ హోటల్ రూంలో ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుకున్న అన్నము ఆరగించి , సాయంత్రం 4.45 గంటలకు  ఎడిసన్ కి రిటర్న్ బయలు దేరాము .

                                                                                             ************

8 comments:

  1. 2008 lo memu choosinadi mee tapaa mallee marokkasaari kallaku kattinatlu choopinchindi!nela kritam Minneapolis vacchaam kaani eesaari akkadikivelladam veelu kaakapovacchu!

    ReplyDelete
    Replies
    1. సూర్యప్రకాష్ గారు ,

      నమస్తే . మీరు అలా ఆనందించినందులకు సంతోషం . అవకశం ఉంటే మరోమారు చూడండి .

      Delete
  2. wow..Nayagara ...ఎప్పటిలానే మీ వర్ణనతో ఆ ప్రదేశాలు చూసిన అనుభూతి కలిగించారు...దొంగజపం కొంగలు బాగున్నాయి..ఇటు అమెరికా, అటు కెనడాని బాగా తీసారు...అలాగే రెయిన్ బొ బ్రిడ్జి విశేషం ఆశ్చర్యంగా వుంది..photos అన్నీ superb...

    ReplyDelete
  3. వావ్......కళ్ళకి కట్టినట్లుగా వ్రాశారండి.

    ReplyDelete