1 ఇరవై ఏళ్ళు నిండనివారిన సలహాలడగకండి
అరవై ఏళ్ళు నిండిన వారిని సలహాలడగండి .
2 అప్పు చేసి పప్పుకూడు తినటం
తప్పు చేసి జైలు కూడు తిన్నట్లే .
3 డొంక అంటే గతుకుల బాట
నిజం అంటే నిప్పుల మూట .
4 చిరాకున్నా , పరాకున్నా
బ్రతుకు సమస్య అవుతుంది .
5 పొగడ్తలకి
నమ్మకం అనే నరం అరిగిపోతుంది
గర్వం అనే నరం పెరిగిపోతుంది .
6 పేదవారిని బెదిరించకు
పెద్దవారిని ఎదిరించకు .
7 అనుభవాన్ని మించిన చదువు లేదు
నమ్మకాన్ని మించిన గురువు లేడు .
8 వయసులోని పొందు
వయసులోనె పొందు .
9 చెక్కిలిపై ముద్దివ్వు
బిగి కౌగిలి సడలివ్వు .
10 సంద్రంలో ఆనందానికీ , కల్లోలానికీ ఆనవాళ్ళు కెరటాలే
మనిషిలొ ఆనందానికీ , విషాదానికీ ఆనవాళ్ళు కన్నీళ్ళే .
( మళ్ళీ కలుసుకొందాం )
No comments:
Post a Comment