అంతరంగ రహస్యం




నేను ,

చేయలేనివి  ఎవరో చేసేస్తుంటే సంతోషిస్తా
చెప్పలేనివి ఎవరో చెప్పేస్తుంటే సంతోషిస్తా
చూడలేనివి ఎవరో చూసేస్తుంటే సంతోషిస్తా
తినలేనివి , తినకూడనివి ఎవరో తినేస్తుంటే సంతోషిస్తా

చేయాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరో చేసేస్తుంటే  ఏడ్చేస్తా
చెప్పాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరో చెప్పేస్తుంటే  ఏడ్చేస్తా
చూడాలనుకున్నవి  ( నాకంటే ముందర ) ఎవరో చూస్తుంటే  ఏడ్చేస్తా
తినాలనుకున్నవి   ( నాకంటే ముందర ) ఎవరెవరో తినేస్తుంటే ఏడ్చేస్తా


ఇష్టం లేనివి చెప్పేటప్పుడు ఒమిట్ చేస్తా
నాకిష్టమైనవాటికి కమిట్ అవుతా

నేనే ఈ కలికాలపు జీవిని
ఈ జీవితం సుఖదుఃఖాల మిశ్రమం
ఇదే అసలు సిసలు అంతరంగ రహస్యం .

                           *******************

2 comments:

  1. అంతరంగగహస్యాలని అతి బాగా ఆవిష్కరించారు........

    ReplyDelete
    Replies

    1. సహజంగా ప్రతి మనిషికీ రెండు రూపాలుంటాయి .
      కనపడే రూపం ఒకటి, కనపడనిదే విశ్వరూపం .
      ఆ విశ్వరూపమే మనం అనుకొనే అంతరంగం .

      Delete