నన్ను చూశాడు





నన్ను చూశాడు ,
కన్ను గీటాడు ,
నన్ను చేరమన్నాడు , 
తను చేరుకున్నాడు ,
మరువం మరువరానిదన్నాడు ,
మధురాతి మధురమన్నాడు , 
మల్లెపూలు యివిగో అన్నాడు ,
ఎదలో చోటియ్యమన్నాడు ,
పయ్యెదనే పక్కకేశాడు ,
భయము వలదన్నాడు ,
వదలమన్నాడు ,
అభయమిదే నన్నాడు ,
ఉభయం తనదే నన్నాడు ,
భయం , భయం అంటుంటే ,
న భయం , న భయం అంటూ ,
చెంత చేరబోయాడు ,
రానే వచ్చాడు మా అయ్య ,
వేయనే వేశాడో  గట్టి దెబ్బ . 

          *******

4 comments:


  1. ఏమండీ శర్మ గారూ,

    వేశాక చూసాడాండీ , లేక చూసాక వేసాడాండీ ?


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. జిలేబి గారికి ,

      సుస్వాగతం .

      వేయకముందే చూసి , వాళ్ళ అయ్యే వేశాడండి ఆ దెబ్బ వాడి మీద .
      ఈ విషయం మీకు తెలిసినదే కదండి .

      Delete
  2. గట్టిగావాయించాడండీ! :)

    ReplyDelete
    Replies

    1. శర్మ గారు,

      నమస్తే .

      గట్టిగా వాయించింది వాడు కాదండి , వాళ్ళ అయ్య . మీకూ తెలుసు కదండి .

      Delete