గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ - ఓల్డ్ గ్రేట్ బ్రిడ్జ్

South San Francisco
S F O Down Town
Golden Gate Bridge
తేది : 20/05/2013

ఈ రోజు ఉదయం ఆదివారం అందరు ఆలస్యంగా లేచారు . నేనూ 6.16 కి లేచాను , నా కాలకృత్యాలు ముగించుకుని 
ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కధను కరెక్ట్ చేసుకొంటున్నాను . నా శ్రీమతి కాఫీ యిచ్చింది .  నా పెద్ద మనుమడికి మొన్న 
మిష్టరీ స్పాట్ ,ఎస్ ఎఫ్ ఓ బీచ్కి వెళ్ళి వచ్చిన ప్రభావం , ఆ పై వద్దన్నా వినకుండా అర్ధగంట సమయం చేసిన బబుల్ 
బాత్ ప్రభావం , వెరసి జలుబుతో కూడిన జ్వరం సరసన చేరాయి . 

ఇటువంటప్పుడే మనం మన మంచితనాన్ని , విచక్షణాఙ్నానాన్ని కోల్పోవటము జరుగుతుంటుంది ,ఆలోచించ
నీయకుండా కోపం కప్పేస్తుంది .  కోపం మనను ప్రవేశించగనే , మనుషులమైన మనం పశువులుగా మారి , పసి
వాళ్ళను యిబ్బందుల పాల్జేయటం జరుగుతుంటుంది .

అందుకనే తమాయించుకొని ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు చేసినదాంట్లో తప్పు లేదన్నది మనకు అవగతమవు
తున్నది . అదే కదా బాల్యం . ఆ బాల్యమే కదా మనం పోగొట్టుకున్నామని ఎన్నోమారులు ఎంతమంది దగ్గరో బయటపడిన వాళ్ళమే కదా ! మనం పోగొట్టుకున్నది మన పిల్లలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అన్నది మనం గ్రహించుకుంటే , వాళ్ళని మనం కోపగించవలసిన అవసరమే రాకుండా పోతుంది ఈ విషయంలో . 

దానితో కొంచెం ఆలస్యంగా లేచి , భోజన కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఎస్ ఎఫ్ ఓ గోల్డెన్ గేట్ బ్రిడ్జి కి వెళ్దామ నుకున్నాము .

అలాగే 2.30 కి బయలుదేరాం కారులో . ఆ అందమైన  రహదారుల  చుట్టూరా అందమైన కొండలు ఎవరో పేర్చినట్లు
న్నాయి . ఆ కొండలలో అచ్చటచ్చట అందమైన ఆకృతులతో భవనాలు , ఆ భవనాల ముందు కళాకృతులతో చక్కటి సారీ చిక్కటి చెట్లు మొక్కల్లా కనపడుతూ మన కళ్ళను ఆకర్షిస్తాయి  . 

ఇంత ట్రాఫిక్ కి అసలు మూల కారణం వేరే ఉంది . అదేమిటంటే ఈ అమెరికాలో వీకెండ్ రాగానే వీకెన్ అయిపోయిన వీళ్ళందరూ , యిళ్ళను వదలి హాయిగా ఎంజాయ్ చేయాలని యిలా విహారయాత్రలకు వెళ్తుంటారు . ఈ వెళ్ళటంలో కొంతమంది స్వంత కార్లలో , యింకొంతమంది రెంటల్ కార్లలో , మరి కొంతమంది తమ స్వంత  కార్ హౌస్ ఎటాచ్ మెంటుని  ( అంటే దీనిలోనే బెడ్ , కిచెన్ , బాత్ రూం ఉంటాయి  , ఇవి అద్దెకు కూడా దొరుకుతుంటాయి , కాకుంటే వీటిని ఎక్కడంటే అక్కడ కార్లలా పార్క్ చేయ వీలు కాదు . )ని తమ కారుతో , తీసుకుని ఇలా వెళ్తుంటారు . ఇటువంటివన్నీ ఆ రహదారిని అపుడపుడు కొంత సమయం పాటు స్తంభిపచేస్తుంటాయి .

ఆ రహదారి అన్ని రకాల వాహనాలతో  .  క్రిక్కిరిసి పోయి , అక్కడక్కడ 10 , 15 నిముషాల చొప్పున ఆగుతూ 3.25 కి చేరాము ఓల్డ్ ఎస్ ఎఫ్ ఓ మీదుగా గోల్డెన్ బ్రిడ్జి దాటాము . 

నిజంగా చూడ కనువిందుగా ఉన్నది . ఈ బ్రిడ్జి సముద్రం మీద క్రింద సపోర్టులు లేకుండా స్ప్రింగ్ మీద నిర్మిం
చబడ్డది . వాళ్ళ నిర్మాణ  నైపుణ్యానికి హ్యాట్స్ ఆఫ్ .వాళ్ళు ఏది తయారు చేసినా ఆ నాణ్యత కనపడుతుంది . 
అక్కడ ఆ సుందర దృశ్యాలను కళ్ళారా చూసి , కెమేరాలో బంధించటం జరిగింది . మధ్యలో షిప్ లో సైట్ సీయింగ్ ఆ 
ప్రక్కన డౌన్ టౌన్ ( కొత్తగా కట్టబడిన ఎత్తైన కట్టడాలు ,ఇదే కొత్త ఎస్ ఎఫ్ ఓ ) , నడుమ ఆల్క్రాట్జ్ దీవి ( పాత కాలంలో షిప్ మీదగా అమెరికా వచ్చేవాళ్ళకి పోర్ట్ ఆఫ్ అథారిటీగా పని చేసింది , యిప్పుడు ఖైదీలనుంచే జైల్ గా ఉపయోగిస్తున్నారు . 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది 1866 నుంచి .) ఉన్నది .

గోల్డెన్ గేట్ బ్రిడ్జి నుంచి ఆ వైపు ఉన్న కొండల నుంచి సైట్ సీయింగ్ ప్లేసులకి కారులో వెళ్ళాము . ఈ మధ్యలో బైసైకిల్ష్ట్ 
లు ఆడా మగా తేడా లేకుండా వేగంగా వెళ్తున్నారు ఆ కొండ పైకి . నిజంగా సుందర దృశ్యమే , ఎడమ వైపు డౌన్ టౌన్ , గోల్డెన్ గేట్, ఇంకొక వైపు సముద్రం , మరొక వైపు లోతైన లోయలు . కెమేరాలో కొన్ని సుందర దృశ్యాలను క్లిక్ చేశాము .

అక్కడ నుంచి రిటర్న్ యింటికి .  


                                                                      ********








No comments:

Post a Comment