1 కడుపు నిండితే కబుర్లు ,
కడుపు మండితే రచనలు .
2 ఆడిన మాట తప్పకు ,
వాడిన మాట వాడకు ,
తిట్టిన తిట్టు తిట్టకు .
3 పడుచు అలిగిందంటే వలపు రేగిందన్నమాటే ,
ముసలిది అలిగిందంటే ముసలం పుట్టిందన్నమాటే .
4 తడి ఒక వయసు దాకే ,
తపన తనువు చాలించే దాకా .
5 పదవి , పెదవి లేనిదే ,
ఈ ఫృదివే లేదు .
6 ఎదుటివారికి చెప్పేటప్పుడు ఉన్నంత ఊపు ,
తను చేసేటప్పుడు ఉండదు .
7 నిప్పు లేనిదే పొగ రానే రాదు ,
తప్పు చేయనిదే పగ కానే కాడు .
8 పగ వద్దు అంటే పలువురితో గలభా పడవద్దని ,
ప్రేమ అంటే ప్రేరణతో మమత అని .
9 బతికినప్పుడు నవ్వులు ,
పోయినప్పుడు నువ్వులు .
10 నలుగురిలో నవ్వులో పాలు పంచుకో ,
నలుగురిలో మాత్రం నవ్వులపాలు కాబోకు .
( మళ్ళీ కలుసుకొందాం )
9 బతికినప్పుడు నవ్వులు ,
పోయినప్పుడు నువ్వులు .
10 నలుగురిలో నవ్వులో పాలు పంచుకో ,
నలుగురిలో మాత్రం నవ్వులపాలు కాబోకు .
( మళ్ళీ కలుసుకొందాం )
*********
No comments:
Post a Comment