ట ట్ట డాం టాం టాం

                                                                         ట ట్ట డాం  టాం టాం  
                                                                                                                                  రచన : శర్మ జీ ఎస్
                                                                                 జీ పి ఎస్
                                                                     ( గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం )
                                                          

    



అమెరికాలోఎక్కడకు వెళ్ళాలన్నా స్వంత వాహనం తప్పనిసరి . కాళ్ళను నమ్ముకొంటే చాలదు , కార్ల లాంటి                  
వాహనాను నమ్ముకోవాలి . ఈ అమెరికాలో కార్లే ( వాహనములు ) ఎక్కువ . ఒక మనిషికి ( ఆడ , మగ ) రెండుకాళ్ళు వుంటాయి . ఇది సహజమైన విషయమే , అందరకు తెలిసినదే . తే కార్లు మాత్రం రెండుకు పైనే వుంటుంటాయి ఆడవాళ్ళకు , మగవాళ్ళకు . కొంతమందికి ఈ వాహనాలే కాక , కిచెన్ వాహనం , ఇంకొంతమందికి లగేజ్ వాహనం , మరికొంతమందికి , బోట్ వహనం లాంటివి కూడా వుంటుంటాయి .ఇక్కడ యిళ్ళకు కార్ షెడ్ లంటూ వుండవు . పైగా కాంపౌండ్ వాల్స్ వుండనే వుండవు కూడా . ఈ యిళ్ళన్నీ కలప( చక్కల ముక్కలతో ) మిర్మిస్తారు . ఇంటిముందు అందమైన కళాకృతులతో చెట్లు , వామనని  ఆకారంలో వున్న చిన్ని చిన్ని మొక్కలకే అందమైన పూలు ఆనందాన్ని అందిస్తూ వుంటాయి . ఆవరలో  పచ్చపచ్చనివాతావరణంతో కళకళలాడుతూ వుంటుంది .                            

మనకొక సందేహం కలగవచ్చు , మరెక్కడ పార్క్ చేస్తారు యిన్ని కార్లని అని . నిజమే , వాళ్ళకొక షెడ్ వుంటుంది ప్రతి యింటికి . ఆ షెడ్ ని గార్బేజ్గా వుపయోగించుకొంటుంటారు . ఆ మెయిన్ డోర్ షట్టర్ లా పైకి ఓపెన్ చేయ
బడ్తుంది . దానికెదురుగా బైట ఒక కార్ పార్క్ చేస్తారు . మిగిలిన వాహనాలను వాళ్ళ యింటి ఎదురుగా రోడ్ మీద పార్క్ చేస్తారు . మెయిన్ రోడ్లు మాత్రం విశాలంగా 3 లైన్లు కుడి వైపు , మరో 3 లైన్లు ఎడమ వైపు వుంటాయి రైట్ సైడ్ డ్రైవింగ్ తో , లెఫ్ట్ హాండ్ స్టీరింగుతో .అడ్డరోడ్లలోనే నివాసగృహములు వుంటాయి .

అసలు విషయానికి వద్దాం . ఏ దేశస్థుడైనా ఈ అమెరికాలోని ఏ స్టేట్ చూడదలచుకున్నా చాలా దుర్లభమే . ఎందు
కంటే వాహనంలో బయలుదేరిన తర్వాత ఎవర్నీ అడ్రెస్ అడగటానికి వీలుపడదు . సిటీలో మెయిన్ రోడ్ మీద వాహ
నాల వేగం 40 మైల్స్ అంటే 64 కిలోమీటర్లు . అడ్డరోడ్డులో 25 ( 40 కిలో మీటర్లు ) నుంచి 35 ( 56 కిలో మీటర్లు )  మైళ్ళ వేగం .  స్టేట్స్ ని మాత్రమే కాదు లోకల్ లోని వాటిని కూడా ఎటు వెళ్తే మన గమ్యం వస్తుందో తెలియకపోతే , మనం ఎటూ వెళ్ళలేం మహా కష్టం .ఇండియాలోలా యిక్కడ బస్సులలో వెళ్ళి చూసే ప్రదేశాలు కాదు . ఇండియాలో బస్సులు , యిక్కడ ఎయిర్ బస్సులే . అలా వెళ్ళటం ఖర్చుతో కూడుకున్నదే . లోకల్ వాళ్ళకు ఖర్చుగా భావించరు .
ఇలాంటి యిబ్బందులు ఎవరికీ కలగకుండా అమెరికన్ సైంటిస్ట్ తను 1956 లో కనుక్కొన్న జీ పి ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిష్టం ని  ప్రత్యేక శ్రధ్ధ తీసుకొని మోడర్నైట్ చేసి అందించాడు 1998 లో . ఆ నాటినుంచి ఈ దుస్థిని మెలమెల్లగ అధిగమించటం జరిగినంది .

ఈ జీ పి ఎస్ ని వాహనంలో స్టీరింగ్ పరిసర ప్రాంతాల్లో కనపడేటట్లుగా ఫిక్స్ చేసి ప్లగ్ లో పెట్టి , ఆన్ చేసి మన గమ్యం 
అందులో ఫీడ్ చేస్తే అది , తన వద్దనున్న సమాచారంతో మనకెదురుగా దర్శనమిస్తుంది .

మన గమ్యం ఎన్ని మైళ్ళ దూరంలో వున్నది , ఎంత టైం లో అక్కడకి చేరుకుంటామో బయలుదేరే సమయాన్ని బట్టి స్క్రీన్ మీద చూపిస్తుంది . అంతే కాకుండా మనం వెళ్ళే ప్రదేశంలో వాతావరణం ఎలా వుందో తెలియచేస్తుంటుంది .  మనమున్న ప్రదేశం నుంచి ఎటు వెళ్ళాలి ? అక్కడ ఎన్ని రోడ్లు వున్నాయి , ఏ రోడ్డులో వెళ్ళాలి ? అలా ఆ రోడ్ స్ట్రైట్ గా వుంటే , ఎన్ని మైళ్ళు అలా వున్నదో ( ప్రయాణించాలో ), ఎక్కడ రైట్ తీసుకోవాలో , ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసు
కోవాలో , ఏ రోడ్డు ఎన్ని వంకరలు తిరుగుతూ వెళ్తుందో ,అన్నీ తను చూపిస్తూ , స్పీకర్ లో వినిపిస్తూ , మనం ఎక్క
డైనా హోటల్ , లేదా గ్యాస్ ఫిల్లింగ్ బంక్స్ ( పెట్రోల్ ) వద్ద ఆగాలనుకుంటే ( బ్రేక్ అంటారు ) , దానికి నువ్వు వున్న చోటినుంచి ఎటు వెళ్తే ఎగ్జిట్ వస్తుందో చూపిస్తూ , వినిపిస్తుంది . మళ్ళీ అక్కడ నుంచి మనం మన గమ్యానికి ఎంత సమయంలో చేరుకోగలమో ,స్క్రీన్ మీద చూపిస్తూ , మైక్ ద్వారా వినిపిస్తుంది . ఓ వేళ పొరపాటున మనం దారి తప్పితే , అలా ఆ వున్న చోటినుంచి మనం వెళ్ళవలసిన గమ్యాన్ని తెలియచేస్తుంది . మన గమ్యంలో ఎక్కడ తోల్ గేట్లున్నాయో , చూపిస్తూ వివరిస్తూ మనల్ని క్షేమంగా గమ్యం చేరుస్తుంది .ఇంతే కాకుండా అది సూచించిన ప్రకారం మనం ఆ రోడ్లలో వెళ్తుంటే , మన వాహనం ఏక్కడ వున్నదో మనకు డిస్ప్లేలో కనపడ్తుంటుంది . ఇదంతా శాట్లైట్ ద్వారా జరుగుతున్నది . అయితే ఆ జీ పి ఎస్ లో ఈ అమెరికాలోని అన్నిరూట్లను అందులో ఫీడ్ చేయటం వల్ల ( ఏ రోడ్డు ఎక్కడనుంచి ఎంతదూరం వున్నది మైళ్ళలో ) ఏమీ తెలియని , డ్రైవింగ్ వచ్చివారెవరైనా , వెళ్ళాలనుకున్న     
వారెవరైనా అతి సులభంగా వెళ్ళి రాగలుగుతున్నారు .

ఇక్కడ మనకు వాహనం లేకున్నా ( మనకు డ్రైవింగ్ వచ్చుంటే , డబ్బుంటే , చూడాలని అభిలాష , అవకాశం వుంటే  ) అద్దెకిస్తారు . హాయిగా ఎంతదూరమైనా ఎక్కడికైనా వెళ్ళి చూడదలచుకున్నవన్నీ చక్కగా చూసి రావచ్చు .అందు వలననే ఇప్పుడు అమెరికాలో ఏ స్టేట్ నయినా అతి సులభంగా చూడగలుగుతున్నారు ఏ దేశస్థులైనా .

ఇటువంటి దాన్ని కనిపెట్టిన రోగర్ ఎల్ ఈస్టన్ ఏప్రిల్ 30 1921 క్రాఫ్ట్స్ బరీ లో పుట్టారు  .
   
 ఇప్పుడు ఈ టెక్నాలజీతో చాలా చాలా కంపెనీలు జీ పి ఎస్ లను తయారు చేసి మనకు అందుబాటులోకి తెచ్చాయి . 

అందుకే ఈ నాడు ఎవరైనా , ఎక్కడికైనా , ఎప్పుడైనా , ఎవ్వరినీ అడగకుండా హాయిగా చూసి రాగలుగుతున్నాము .
ప్రజాశ్రేయస్సుకి పాటుపడే ఇటువంటి వాళ్ళకు అనంతకోటి మానవుల అభినందనలు  అందించాలన్న తలంపుతో యిది వ్రాయటం జరిగింది  ఈ బ్లాగు ద్వారా .   

  
                                                                    **********                                                        
                                                                                                                

3 comments:

  1. I know something about GPS. u v further clarified. Thank u. of course I am not visiting America in my life time :)

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ ,

      నమస్తే .

      నకు తెలిసిందేదో పదిమందికి తెలియచేయాలనే ఒక చిన్న ప్రయత్నమే ఇది . నిజానికి నాకూ అమెరికా చూడాలని లేదు మా అబ్బాయి అక్కడే వున్నా . నా దృష్టిలో హౌస్ వైవ్స్ కి , చిన్న పిల్లలకి , వయసు మళ్ళిన వారికి ఓ అందమైన చెఱసాల అమెరికా అనుకుండేవాణ్ణి . తప్పనిసరి వచ్చాను . తీరా వచ్చిన తర్వాత , కళ్ళతో చూస్తున్నాక మనలాంటి వారు కోరుకున్న , కలలు కంటున్న మంచి మంచి నియమాలను ఆచరణలో చూస్తున్నప్పుడు అంగీకరించకుండా వుండలేము కదా ! ఇదీ అంతే . మనమెటూ మన ఇండిYఆలో ఇవి చూడలేము ఈ జన్మకు కాదు కదా , కొన్ని జన్మలెత్తినా . అవకాశం లభిస్తే ఓ మారైనా చూచితీరవలసిందే మంచినే కోరుకుంటున్న మనలాంటి వాళ్ళందరూ . బలవంతమేమి కాదు . విన్నపం మాత్రమే .

      Delete
  2. పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అమెరికా వాళ్ళ కష్టాలు అమెరికా వాళ్ళవి!

    ReplyDelete