1 ఆడది సృష్టికి మూలమైతే ,
మగవాడు ఇంటికి మూలం
2 మగవానికి ఆఫీసులోని కాగితాలు ఎంత ముఖ్యమో
ఇంటిలోని జీవుల జీవితాలూ అంత ముఖ్యమే .
3 జీవితం
ఎవరి చేతుల లోనూ లేదు
వారి వారి చేతల లోనే ఉంటుంది .
4 భార్య
దగ్గరుండి ఆనందపెడుతుంది
దూరానుండి బాధపెడుతుంది .
5 నీతి కానిది ఆసించకు
నీది కానిదీ ఆసించకు
నీ దానిని ఆలస్యం చేయకు .
6 నిలకడలేని మనసు
తలగడలేని పరుపుతో సమానం .
7 ప్రమాదాన్ని ఎదిరించు
ప్రమోదాన్ని ఆస్వాదించు .
8 ఆదరణ , ఆచరణ కవలలు.
ఆదరణతో మనస్సును మచ్చిక చేసుకో
ఆచరణతో జీవితాన్ని బాగుచేసుకో .
9 మూసిన తలుపులు
తీయని తలపుల గురుతులు .
10 తెలియక చేసేది పొరపాటు
తెలిసి చేసేది అలవాటు .
( మళ్ళీ కలుసుకొందాం )
తెలిసీ తెలియక చేసేది గ్రహపాటా ?
ReplyDeleteతెలియక చేసేది గ్రహపాటు అయ్యేది సమర్ధించుకొనే వాళ్ళ విషయంలో . వాస్తవానికి పొరపాటే కరెక్ట్.
@ భార్య
ReplyDeleteదగ్గరుండి ఆనందపెడుతుంది
దూరానుండి బాధపెడుతుంది .
ఈ కాలం మృగవాళ్ళు భార్య దూరంగా ఉంటే పండగలు చేసుకుంటున్నారు...అటువంటప్పుడు... ఆమెకి మాత్రం ఏమి అభిమానం ఉంటుంది ...??
Deleteనేను చెప్పింది మగవాళ్ళ గురించి , మృగవాళ్ళ గురించి కాదుగా .
భార్య
ReplyDeleteదగ్గరుండి ఆనందపెడుతుంది
దూరానుండి బాధపెడుతుంది .
నాకు ఈ లైన్స్ బాగా నచ్చాయి!!! నిజమో కాదో తెలీదు కాని చాలా చాలా బావున్నాయి!!