1 పన్ను మీద పన్ను వస్తే అదృష్టం .
పన్ను మీద పన్ను వేస్తే ముదరష్టం .
2 ఆలోచనలలో ఆత్రం చూపకు
ఆచరణలో ఆలస్యం చేయకు .
3 ముడతలు పడ్డ శరీరం
మడతలు పడ్డ కాగితంతో సమానం .
4 ఆడది ఆడది కలిస్తే
సెక్సు అవుతుందా ?
వెక్సు అవుతుంది .
5 సంసారం సాగరం అయితే
బిజినెస్ బే ఆఫ్ బెంగాలే మఱి .
6 ఉధ్ధరించటానికి ఉధ్ధరిణెకిచ్చినంత విలువ ఇవ్వాలి
ఉధ్ధరిణె చిన్నదే కదా అని
ఉధ్ధరించటంలో చిన్నచూపు చూడకూడదు .
7 దేశ భాషలందు తెలుగు లెస్స
అన్యదేశములందు తెలుగు లెస్సు .
8 పంతం
కొన్ని సమయాల్లో
తిరోగమనానికి ప్రధమ కారణం
మరి కొన్ని సమయాల్లో
పురోగమనానికి పరమపద సోపానం .
9 ఒంట్లో బాగలేకున్నా ,ఇంట్లో బాగలేకున్నా
ఒడిదుడుకులు చోటు చేసుకొంటాయి .
10 తిరగమోత వేసేటప్పుడు వచ్చే సువాసన
తినేటప్పుడు ఉండకపోవటం అతి సహజం .
( మళ్ళీ కలుసుకుందాం )
:)
ReplyDelete