గీతానికి సంగీతం తోడైనప్పుడే రాణిస్తుంది. తెలిసినా నేను దానివాడిని కాకపోవటం వలన
యధాతధంగా అక్షర రూపంలో మీ ముందుంచుతున్నాను.
నాది నాది అనుకొంటే
నీకేమి మిగలదోరన్నా
తుట్ట తుదకు నీకు
నీవే మిగలవోరన్నా నాది
బ్రతికినన్నాళ్ళే నేను
నీవు భేదమోరన్నా
చిట్ట చివరకి అందరం
ఒక్క చోటికే చేరతామురోరన్నా నాది
ప్రాణమున్నన్నాళ్ళే ఈ
మంచి చెడుల తేడాలోరన్నా
ఏ కాడకీ ఈడే ఆ తేడాలోరన్నా
వల్లకాటిలో ఏ తేడాలుండవోరన్నా నాది
వచ్చేటపుడేమీ వెంట తేలేదురోరన్నా
పోయేటప్పుడేమీ వెంట రాదురోరన్నా
మూర్ఖులకిది తెలియరాదురోరన్నా
ముమ్మాటికీ యిది నిజమురోరన్నా నాది
******
అది తెలిస్తే గొడవలేదన్నా ! అంతా విష్ణుమాయ
ReplyDelete
Deleteఅది తెలియకనే , తెలియనిదే జగ(డ)మాయె.
good one..
ReplyDeleteథాంక్యూ.
Delete