ఈ చాకలి తిప్పడు ఏకపాత్రాభినయం " మాలిక " వెబ్ మ్యాగజైన్ లో 30-12-2012 న ప్రచురించబడినది.
” చాకలి తిప్పడు ” ( ఏకపాత్రాభినయం )
రచన : శర్మ జి ఎస్
లచ్చా , లచ్చా, ఓ లచ్చా, నా అబ్బడాల సుబ్బలచ్చా , నానొచ్చా, తొరగా రాయే ……. .
ఏటే ఎంతకీ రాయేటే , ఓ ! అదా యిసయం , నానొచ్చే ఏలకి మోటుగుంటే బాగుండదని , నీటుగ అద్దంలోనికి సూత్తూ, సాటుగ బొట్టూ కాటుకెట్టుకుంటున్నావంటే. మనం మనం ఒకటే గదంటే, నాకాడ నీకు సోకేటే ? అయినా , నీ సోకు నాకు తెల్వదేటే ? లచ్చ్క్హా ఓ లచ్చా , ఈ సోకుల సాకులతో ఆలస్సం సేయక తొరగా రాయే , రాయే తొరగా రాయే .
( ఎంతకీ రాకపోయేసరికి )
ఏటే రాదేటే ? ఇంటో నేదా ? ఎటెల్లిందబ్బా ? ఎన్నిచార్లు సెప్పాలే , నా సాటున నీవెన్ని ఏసాలేసినా పర్లేదే , ఎటొస్సీ నాకు తెల్వదు
గదంటే ఆ ఏసాలు. సీ…. సీ…. నిన్ననుకొని ఏం నాభమే . మా అప్ప , అదేనే , మీ అమ్మ నిన్నంటగట్టి నాకీ తిప్పలు తెస్సి పెట్టినాదె. సచ్చేది సావక నా సెయ్యట్టుకొని, తన సేతిలో ఎట్టుకొని, నిన్నేలుకుంటానని పెమాణకం సేయించొకొన్నాదె . అద్గదె అక్కడ కొట్టిందె దెబ్బ. పేదోళ్ళు మాణిక్క్యలెట్టుకోకపోయినా పెమాణకాలకి కట్టుబడి ఉంటారు గదంటె. ఆ అల్సు చూసుకొనిగదంటె ,నీవాడిందే ఆట పాడిందే పాటగా సెలామణి సెయ్యమని నా పాణాలను తోడేలులా తోడేత్తున్నావు గదంటె.ఎంతకాలమిలా ఏలతావో , ఎంతకాలమిలా ఏడిపిత్తావో నానూ సూత్తాలేయే.

సీ…. సీ…. ఇట్టాంటి పెల్లాముతో కాపురం సేసేకంటే పురం వదలి ఎల్లటమే మేలంట. ఔనౌను నాను ఊరొదలి ఎల్తే ,ఊళ్ళో ఆసాముల బట్టలుతికే మడేల్ మరొకడెవడు లేడు గంద.సరెలే అని సాకిరేవుకెల్లి బట్టలుతుక్కొద్దామా అంటె ,ఆ సాకిరేవేమో ఊరిసివర సస్సినాదే.ఆడకి ఓ పెద్దపులి ఒంటరిగా వస్సి , సంసారాన్నే ఎట్టిందంట. నానిపుడు రేవుకాడకెల్లేదెట్టాగంటా ? ఎట్టాగాంటా ? ఎట్టాగాంటా ? పోనీ ధైర్నం సేసి పోతే…… , అమ్మో ఇంకేటన్నా ఉందా నాయాల్ది , పెపంచకం మొత్తం తలకిందులయిపోదూ . అలా తలకిందులయిన పెపంచకాన్ని , మల్లా మామూలు పెపంచకం సెయ్యాలంటే , గోపంచకం సల్లితే గాని , మామూలు పెపంచకం గాదంట. అంత గోపంచకం నానేడ పట్టుకొచ్చేది,ఇదంతా దేనికిలే. అసలు నానాడకెల్లకుంటే పోలా.
ఆ….. తట్టినాది, తట్టినాది , నా తలకు తట్టినాది.ఆ పులిని సంపి ఆనమాలు తెస్సి యిస్సినోడికి రాజుగోరు , అద్దరాజమిస్సి , తన కూతుర్నిస్సి పెల్లి సేత్తనని దండొరా కొట్టించినాడు గంద.ఇది గుత్తొస్సినాక కూడా నాను సావటమేమిటి ? ఓ ఏల నానే ఆ పులిని నానే సంపితేనో …… , నానే ఆ పులిని సంపితేనో …….అబ్బ, అబ్బ,అబ్బ , నా అదురుట్టమే అదురుట్టం గందా! నా అదురుట్టం ఎదురుగొట్టంలా ఎకాయికీ ఆకాసాన్నే అంటుకుంటుండాదె. అబ్బ, అబ్బ, అబ్బ , నా అదురుట్టమే అదురుట్టం గందా!
( ఆనందంలో తేలియాడుతుంటాడు , ఆ ఆనందాన్నుండి మెల్లగా తేరుకుని )
ఓ ఏల ఆ పులి నా మీదకే తిరగబడితే….. ? ఆ….. ఏటౌతదేటి ? అదురుట్టం ఎనక్కెల్లి ముదరట్టాన్ని ముందుకు నెట్టేత్తది.
ప్చ్ అంతే గంద. అస్సలు ఈ జీవితానికి ఎపుడైనా తెగింపు కావాలంట, అపుడే ముగింపు వత్తదంట .
ప్చ్ అంతే గంద. అస్సలు ఈ జీవితానికి ఎపుడైనా తెగింపు కావాలంట, అపుడే ముగింపు వత్తదంట .
( ఇంతలో పులి అరుపు విన్నవాడై )
అయ్యబాబోయ్ , పులి… ,పులి…, అరుత్తుండాదె , అమ్మో ఇటే వత్తుండాదె . సచ్చానురోయ్ , సచ్చానురోయ్ ,సచ్చానురోయ్
( పరుగెత్తుతూ , ఎనక్కి తిరిగి చూసి ) ఆ! ఏం ధైర్నం ? ఏం ధైర్నం ? సూడబోతే సొరకాయంతలేడు , సొరసేపలా పరుగులు తీస్తుండాడు. ఏంటా పరుగు ? ఏ కాయకీ పులిమీదకే దూకేత్తుండాడే .
( పరుగెత్తుతూ , ఎనక్కి తిరిగి చూసి ) ఆ! ఏం ధైర్నం ? ఏం ధైర్నం ? సూడబోతే సొరకాయంతలేడు , సొరసేపలా పరుగులు తీస్తుండాడు. ఏంటా పరుగు ? ఏ కాయకీ పులిమీదకే దూకేత్తుండాడే .
( శబ్దాలన్ని ఒక్కమారుగా నిశ్శబ్దంలో చేరిపోయేసరికి )
ఏటబ్బా ? ఇది . ఏడా సడి , సప్పుడు నేదే . పులి నేదూ , పిలగాడూ నేడే . కాసింత ముందుకు పోయి సూత్తా, కాసింతన్నా తెలియక పోతుందా ( అనుకొంటూ ముందుకు పోతాడు , అచ్చట పడుకొని ఉన్న పులిని చూసినవాడై ) అయ్యబాబోయ్ పులి…పులి…పు..లే….పు..లి ( వణుకుతున్న గొంతుతోనే అయినా ఈతని అరుపులకు ఆ పులి లేవలేదు. బాగా గాఢనిద్రలో ఉన్నదనుకున్నవాడై ) ఇదే మాంఛి సమయంగంద, ఎనకమాలగా ఎల్లి రాల్లేత్తే పొలా ?
ఆ దెబ్బతో దాని బూజు వదులుద్ది , నాను రాజు నయే మోజు తీరుద్ది. ( మెల్లిగా చిన్న చిన్న రాళ్ళు ఏరుకొచ్చి వేస్తాడు ,అయినా ఆ పులి లేవలేదు . )నానేసిన రాళ్ళు తగలకూడనిచోటే తగిలినట్ట్లుండయి. దెబ్బకు సస్సూరుకున్నాది నాయాల్ది . ఇంకా ఈడెందుకు ? రాజుగోరికాడకెల్తే పోలా !
( నిండుకొలువును అలంకరించిన రాజుగారిని చేరుకున్నవాడై )
మారాజులుంగోరికి దండాలు , మారాజులుంగోరికి దండాలు . నానే ఆ పులిని సంపినాది . కావాలంటే సూసుకోండి. ఇదుగో పులీ ,అదుగో తోకా!( చూపిస్తుంటాడు , రాజుగారినుంచి బదులు రాకపోయేసరికి ) ఏటీ ఇంకా ఆలొసిత్తుండారేటి ? పులిని సంపి ఆనమాల్లు తెమ్మంటె , పులినే సంపి తెస్సినాడేమిటనా ? ఆడె ఉంది అసలు కిటుకు. ఈ సమయంలో ఆ సామెత గుత్తుసేసుకోవటం ఎంతైనా సందర్బోచితం. సదువుకొన్నవానికంటే సాకలోడు ( మడేల్ ) మేలంటారు . ఏటికో తెలుసా ?
ఇందుకే ఓన,మాలు ఆనమాల్లు తెలియనొణ్ణి కనుకనే , పులినే ఈడకు ఈడ్సుకొచ్చినా. సూసుకోండి బాగా, ఏదీ రాకుమారిని పిలిపించండి, దండలు మార్సుకొని దండాలెడతాం.మిమ్మల్నే మాంగోరు, నాయాల్ది ఇటు మాట్టాడుతా వుంటే , అటెటో సూత్తారేటి ?

( రాజుగారు చూస్తున్న వైపు తన చూపు మరల్చి , కంగారుగా )
ఆడు… ఆడు… ఆడే …ఆడే… ఆ పిలగాడే , సచ్చానురోయ్ , కొంప మునిగిందిరోయ్ . ఇపుడేం సెయ్యటం ? ఇపుడేం సెయ్యటం ? సెప్పుమా …ఆ…గుత్తొస్సింది , గుత్తొస్సింది, మా అయ్య సెప్పిండుగా , ఇబ్బందులకాలంలో ఇట్టమైనవారిని తల్సుకొని , పిల్సుకుంటే వస్సి ఆదుకుంటార్రా అని. మరి నాకిట్టమైనది ఈ పెపంచకంలో నా లచ్చేగా! .లచ్చా ,లచ్చా,ఓ లచ్చా,నాను సచ్చా , రాయే , తొరగా రాయే. రాజుగోరు నిన్ను ముండమోయించి , రాకుమారిని ముత్తైదువని సేసేత్తుండారే . తొరగా వస్సి రాజుగోరి కూతుర్ని ఏడుకోవే , రాయే ,తొరగా రాయే.లచ్చా ,లచ్చా, ఓ లచ్చా, నాను సచ్చా , రాయే , తొరగా రాయే.
( తెర పడుతుంది )
:) బాగుందే
ReplyDeleteమీలాంటి పెద్దల అభిరుచే నాకు ఆశీర్వాదం . కృతఙ్నతలు.
Deleteఏక పాత్రాభినయనం అంతే ఏమిటి అని అడిగే స్థితి ప్రస్తుత పరిస్థితి .....
ReplyDeleteచాలా చాలా బాగుంది ....వీలుంటే ఇంకొకటి అందించగలరు ....
సమయం వచ్చినపుడు తప్పకుండా.
Deleteమీ ప్రయత్నం చాల బావుంది.
ReplyDeleteఎంతో ఆనందం కూడా వేసింది.క్షమించాలి ఇదివేదిక కాకపోవచ్చు
హరిశ్చంద్ర లోని కాటికాపరి పాత్రని కూడా పరిచయం చేయండి ఈ మీ ప్రయత్నం ద్వార ,
Deleteతప్పకుండా .
చాలా బాగుంది
ReplyDelete
Deleteసంతోషం .