1 ఆ వయసులో చావ ,
ఈ వయసులో యావ .
2 నోటిమాటలతో కడుపు నిండదు ,
నోటు చేతలతో కడుపు పండదు .
3 చెప్పనిది చేయటం ఘోరమైతే ,
చెప్పినది చేయకపోవటం నేరమే .
4 ఆత్రతతో అవిటివాడివి కాబోకు ,
భద్రతతో భవిష్యత్తును బాగుగా చూసుకో .
5 ప్రగతిన పయనించు ,
సుగతిన జీవించు .
6 ఆశలతో ఆత్రపడకు ,
భద్రతనే మరువకు .
7 ఎంతకొట్టినా ఏడవను కానీ ,
తిడితే తక్షణమే ఏడ్చేస్తా .
8 నాడు ముందు చూపు ,
నేడు మందు చూపు .
స్వకార్యం అంటే -- ---- తను చేసుకొనేది ,
ఘనకార్యం అంటే పరాయి పడతితో చేసేది ,
స్వామికార్యం అంటే సన్యా(న్నా)సులతో సంభోగమన్నమాట .
10 మానవుని దయా దాక్షిణ్యాల మీద కొంతమంది మాత్రమే జీవనం సాగించ గలరు ,
భగవంతుని దయా దాక్షిణ్యాల మీద అన్ని జీవరాసులూ జీవనం సాగించ గలవు .
( మళ్ళీ కలుసుకొందాం )
శర్మాజీ,
ReplyDeleteపచ్చి నిజాలు నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారేంటీ?
మన్నించాలి , తప్పనిసరి అయి చెప్పాల్సి వచ్చిందచ్చట . అందుకే ---- ఉపయోగించాను .
Delete