అంతేలే
నీకు నచ్చిందని ఎదుటివారికి నచ్చాలని లేదు .
అలా నచ్చకపోవటం వాళ్ళ తప్పూ కాదు.
నీకు ముఖ్యమైనది , వాళ్ళకు ముఖ్యం కాకపోవచ్చు .
నీకు గుర్తున్నవి, అవతలవారు గుర్తుపెట్టుకోకపోవచ్చు.
అంతమాత్రాన ,
వాళ్ళకు జ్ఞాపకశక్తి తక్కువని అనుకోకు,
నీకు ఎక్కువా అని భావించకు.
వాళ్ళకు ముఖ్యమైనది నీకు ముఖ్యం కాకపోవచ్చు ,
నీకు అది జ్ఞాపకం ఉండకపోవచ్చు .
అంతమాత్రాన నీకు జ్ఞాపకశక్తి తక్కువని అనుకోకు.
జ్ఞాపకశక్తి అందరికి ఒకలాగే ఉంటుంది.
అవసరమైనంతవరకే ఆహ్వానించటం వలన ,
అవసరం లేదని వదిలేయటం వలన,
మరచిపోయినట్లుగా కనపడ్తుంటా(వు)రు అంతేలే .
*********
నిజం బాగా చెప్పేరు. భార్యా భర్తలలోనే ఒకరికి ఇష్టమయినది మరొకరికి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినంతలో విభేదం అనుకోవద్దంటారు. :)
ReplyDelete
Deleteఏ యిరువురి మధ్య బంధం కాని సంబంధం కాని నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది.
nijam!
ReplyDeleteథాంక్యూ . వెల్ కం .
Delete