ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా....?

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్



అసలు దణ్ణం ఎందుకు పెట్టుకోవాలి అని ప్రశ్నించే ఈ రోజుల్లో , దేవుళ్ళకు ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో లేకపోయినా , ఆ సందేహాన్ని నిస్సందేహంగా జనాల మనసుల్లోకి అతి సులువుగా ఎక్కించేస్తుంటారు .


అసలు దేవుళ్ళ వద్దకు ఎందుకు వెళ్తారు , ఎవరు వెళ్తారు అంటే ? 

కష్టాలలో వున్నవాళ్ళు తమ తమ అభీష్టాలను ఆ దేవుళ్ళకు విన్నవించుకొని ఆ గండాల నుండి గట్టెక్కాలనే చెప్పుకోవాలి . 

ఈ జగత్తును పాలించే ఆ దేవుని దర్శించాలని వెళ్ళే వాళ్ళు ( ఎవరైనా గాని ) , ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్క రించాలే తప్ప ఆ పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.



దేవుళ్ళు అంటే మన కష్టాలను తొలగించి , మన యిష్టాలను ఆలకించి ఆదరించేవారని .

అందుకనే అన్ని దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. 
దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదాలు కూడా చెప్తున్నాయి .

ఎందుకంటే ,


దేవుళ్ళ  విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున ఆ విగ్రహాల కళ్ళకు మైనం పెడతారు . ఆ తదుపరి విగ్రహం ప్రతిష్ట జరిగాక ఆ దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింగానే స్వామి వారి దృష్టి మొదట ఆ విగ్రహనికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఆవు దూడపై పడేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారు తన రూపాన్ని తను అద్దం లో చూసుకోనేలా చేస్తారు .అటు పిమ్మట స్వామి వారికి మహా నివేదన ఏర్పాటు చేసి అయన దృష్టి ఆ నివేదన మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి దృష్టి సరాసరి ధ్వజస్తంభం క్రింద ఉన్న తన ప్రతిబింబం మీద పడాలి . వారిద్దరి నడుమ వేరెవ్వరూ నిలబడ కూడదు.  విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ...ఏ రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదనే దేవుని ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోకూడదని అంటారు.


ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించు కోవాలి .


వాస్తవానికి ఈ ప్రపంచం పంచన వుంటున్న ఆ నవగ్రహాలను కూడా , దేవుళ్ళుగానే భావిస్తారు . ఎందుకంటే ఆ గ్రహాల ప్రభావం , ఆ ప్రపంచంలోనే జీవిస్తున్న ఈ మానవుల మీద పడటం వల్లనే , ఈ ఈతిబాధలు కలుగుతున్నాయని భావించి , ఆ గ్రహాల ఆగ్రహాలకు గురి కాకుండా , ఆ గ్రహాలను కూడా ఆ దేవుళ్ళ కోవలోనే చేర్చారు . పూజలు ప్రారంభించారు .


శనికి తప్ప మిగిలిన అన్ని దేవుళ్ళకి  ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు . 

కాని ,
శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి మనమే ప్రక్కకు వెళ్లిపోవాలి .
అయ్యా శనిదేవుడా , నన్ను ఓ పట్టు పట్టి నీ వద్దకు రప్పించుకోవటం వల్ల ,తప్పని సరి నీ వద్దకు  వస్తే నీవు నన్ను వదలిపెడ్తానంటే వచ్చాం . ఇంకా నీ ఎదురుగా ఎందుకు నిలబడ్తామయ్యా బాబూ అని మనసులోనే అనుకొంటూ వెంటనే వెళ్ళిపోవాలట అక్కడ నుంచి .  

                                                                              ********************

కోల్పోతున్నాం..............

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్



ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ , కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. 
అందరూ బాగుంటేనే, మనమూ బాగుంటామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. 
మహర్షులు ఎన్నో సందర్భాలలో  ' పరోపకారార్థమిదం శరీరమ్ ' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించటంలో  వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు . 
అందుకే ఆ మహర్షుల నాలుక మీద సరస్వతీ దేవి నాట్యమాడేది . ఆ విషయం వాళ్ళ వాచకంలో తేట తెల్లమయ్యేది . దానినే వాక్శుధ్ధి అంటారు .
మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు.  సదా తమ సదాశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించ వలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే  అంటే లోక కళ్యాణం కోసమే ఉద్దేశించి వుండేవి అన్న మాట !

మహర్షులు అంటేనే పదిమంది హర్షించదగిన పనులు మాత్రమే చేసేవారని అర్ధం .

ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. 

హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది..

కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో  గల ముఖ్యోద్దేశం .


హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.

తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది .

అసలు గ్రహాలు అంటే శక్తికి ప్రతీకలు . ఈ విషయాన్ని మన ముందు యుగాల వారు క్షుణ్ణంగా పరిశీలించి , వాళ్ళ జీవితాలకు , తోటి వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని , ఆ పై శాస్త్రంగా వ్రాసేశారు . అలా ఏర్పడినవే ఈ శాస్త్రాలు , నియమాలున్ను .

ఈ శాస్త్రాలని చాలా మంది మూఢ నమ్మకాలుగా భావించుకొంటున్నారు .


వాస్తవానికి యివి మూఢ నమ్మకాలు కానే కాదు , నిగూఢ రహస్యాలు మాత్రమే .  దీనిని  
బయటకు వెల్లడి చెయ్యకుండా వుండేసరికి , మఱి కొంతమంది దైవం పేరుతో వాళ్ళను బలహీనుల్ని చేసి క్యాష్ చేసుకొంటున్నారు . 

ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వల్ల శాస్త్రం కూడా విలువను కోల్పోతున్నది . 



                                                                          *                     *                   *

జర జాగ్రత్త , ప్లీజ్ ...........

                                                                                                                                    సేకరణ : శర్మ జి ఎస్

లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్లు , కొంచెం జాగ్రత్త అమిత లాభం అన్న చందాన , మన ఆరోగ్య విషయంలో జర జాగ్రత్త తీసుకొంటే ఆయుః పరిమాణం పెంచుకొని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చో . 
సహజంగా స్వల్పంగా అనారోగ్యం పాలైనపుడు ఎవరైనా గత అనుభవంలో అనారోగ్య బారిన పడినప్పుడు వాడిన మందులనో లేదా మందుల దుకాణదారుడు యిచ్చే మందులనో వాడటం పరిపాటిగా వస్తున్నది . 
ఇక్కడే భవిష్యత్తుకి ( సుదీర్ఘ జీవనానికి ) బంగారు చిల్లి పడ్తుంది . ఆ చిల్లి బంగారుదయ్యటప్పటికి మనం అంత జాగ్రత్తలు తీసుకోము .

అందుకనే జర జాగ్రత్త అవసరమని చెప్ప వలసి వస్తుంది . 

శ్రధ్ధగా ఈ టపా చదివి ఆలోచించి చూడండి . 

Dr Hardik Shah,
CMO, Civil Hospital
Mumbai
This message is from a group of Doctors in India:
(forwarded in public interest)

1) Do not drink APPY FIZZ. It contains Cancer causing agent..

2) Don't eat Mentos before or after drinking Coke or Pepsi because the Person will die immediately as the mixture becomes CYANIDE..

3) Don't eat Kurkure because it contains high amount of Plastic.
If you don't believe burn Kurkure and you can see Plastic melting.!
(News report from "Times of India")

4) Avoid these Tablets, they are very dangerous:
* D-cold
* Vicks Action-500
* Actified
* Coldarin
* Cosome
* Nice
* Nimulid
* Cetrizet-D

They contain Phenyl Propanol-Amide PPA. Which causes Strokes & Are banned in USA...!

Please HELP your friends by informing it..!

Hope it will reach d 121 crores Indians.


please read .

 Dr.  of the United States has found  new cancer in human beings, caused by Silver Nitro Oxide. Whenever you buy recharge cards, don’t scratch with your nails, as it contains Silver Nitro Oxide coating and can cause skin cancer. Share this message with your loved ones.
Important Health Tips:
Answer phone calls with the left ear.
Don't take your medicine with cold water....
Don't eat heavy meals after 5pm.
Drink more water in the morning, less at night.
Best sleeping time is from 10pm to 4 am.
Don’t lie down immediately taking medicine  or after meals.
When phone's battery is low to last bar, don't answer the phone, because the radiation is 1000 times stronger.

                                                            ********************

ఇడ్లీ సాంబారుల కళ్యాణ ఆహ్వానం

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్ 

పాఠకులకు ,

శుభోదయం .

మనం కనపడని శక్తి మీద ఆధార పడి యున్నామన్నది అక్షర సత్యం , అనుక్షణ సత్యం . అయితే ఈ శక్తి మనకు ఈ ప్రపంచంలోని ప్రకృతి వల్ల పలు రకాలుగా లభిస్తోంది .

ఈ జన్మలు కృతఙ్నతతో నిండి యున్నాయి .

ఆ పలు రకాలలో ఆహారం ప్రధానమైనది . అటువంటి ఆహారానికి రూపమిచ్చిన మనకు ఆ ఆహారం కూడా ఆనందంగా వాళ్ళ వాళ్ళ కళ్యాణములకు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నది .

ఓ మారు వాళ్ళ పరిణయాన్ని పరికించండి . ఆ వధూవరులను మనసారా ఆశీర్వదించండి . 

గమనిక : బహుమతులు స్వీకరించబడవు . మమ్మల్ని దీవించుటే మాకు మీ బహుమానం అని భావించండి .




                                                                                ************

సమాజం లోని నక్సలైట్లు

                                                                                                                                 సేకరణ : శర్మ జి ఎస్


వేసవికాలం వస్తున్నదని తలచుకొనగానే గతంలోని ఉష్ణొగ్రతలు , వడ గాడ్పులు , వాటి తీవ్రత దానివలన ఎంతమంది నిర్జీవులయ్యారో , మరెంతమంది నిరాశ్రయులయ్యారో మనకు ఙ్నప్తికి వస్తుంటాయి . రాకున్నా కొంతమంది వలన గాని , కొన్ని సంఘటనల వలన గాని తప్పక ఙ్నప్తికి వచ్చి తీరుతాయి .

ఇదే సమయంలో కాలానుగుణంగా చేసే వ్యాపారులకు ఇదో మాంఛి సీజననే చెప్పుకోవచ్చు .

వేసవి కాలమనగానే వసంత ఋతువు కొత్త పంటలను అందిస్తుంది .

ఒక వైపు హాయిగా మామిడి పండ్ల లోని అన్ని రకాలను ఎంచక్కా తినవచ్చు అనుకొనే వాళ్ళో వైపు వుండగా , వీళ్ళను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే వ్యాపారులు మఱో వైపు , కల్తీలతో ఎక్కువ క్యాష్ చేసుకోవాలనే మోసపూరిత వ్యాపారులింకో వైపు ఉబలాట పడ్తుంటారు .

సాటి మానవులు తినే ఆహారంలో కల్తీ చేస్తున్నారంటే వాళ్ళు మానవులు కాదు , మానవ రూపంలో వున్న దానవులని చెప్పుకోవలసిందే .
ఆ కల్తీ చేసే వాళ్ళు ఎంత కాలమో బ్రతకరు . ఆ కొంత కాలాని కొరకు తోటి మానవులను మట్టుబెట్టజూస్తున్న వీళ్ళు నక్సలైట్లు , మిలిటెంట్స్ , ఐ ఎస్ ఐ మొదలగు తీవ్రవాదుల కంటే , ఘోరమైన వాళ్ళు .
ఈ పైన చెప్పిన అతీవ్రవాదులు ఎక్కడో వుండి అదను కొరకు ఎదురు చూస్తుంటారు . కాని ఈ కల్తీ వ్యాపారులు మనతోనే వుంటూ , మనకు సాయం చేస్తున్నట్లు కనపడ్తూ , మనలని మెల్ల మెల్లగా మట్టుపెట్టేవాళ్ళున్నారు .

ఉదా : ఈ వీడియో లింకు చూడండి .

 https://www.youtube.com/watch?v=GUvOjO8mU5E                                                  

 అన్ని ఆహారాలలోను కల్తీకి అలవాటు పడ్డారు సునాయాసంగా ధనం సంపాదించేటందులకు ..
వీళ్ళ ధన దాహార్తికి ఎంతమంది బలి అవుతున్నారో వయసు తారతమ్యం లేకుండా .
ఈ వేసవి కాలపు ఆనందం మంచు కరగి మాయమైనట్లు ఎందరి జీవితాలో మాయమై పోతున్నాయి వీళ్ళ కల్తీ అకృత్యాల వలన .

ఈ కల్తీని కనిపెట్టేందులకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి . ప్రతి వ్యాపారస్తుడికి అమ్మకపు లైసెన్సులు యివ్వాలి . ఏదైనా తేడా వస్తే ఆ వ్యాపారస్తుడు అందులకు బాధ్యత వహించాలి . అందులకు అతను శిక్ష అమ్నుభవింఛాలి .

పొరుగు దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి రావటం కాదు మన ప్రభుత్వాధికారులకు , వాళ్ళ నుంచి ఎంత మంచి మంచి విషయాలు తెలుసుకొని మన ప్రభుత్వాలు అమలు పరిచే దిశలో అడుగులు వేస్తే , యిప్పటికిప్పుడు కాకపోయినా , ఇంకొన్నాళ్ళకైనా మనమే కాదు , మన దేశం కూడా ఆరోగ్యవంతంగా వుంటుంది . అప్పుడే అగ్ర దేశాలకు దీటుగా నిలబడ్తుంది .

                                                                                  *                       *                    *

చెప్పేటందుకే ___________

                 
                                                                                                                               సేకరణ : శర్మ జి ఎస్
                                                                    






వండర్ ఫుల్ ఫిబ్రవరి 2015



                                                                                                                               సేకరణ : శర్మ జి ఎస్

జనవరి , ఫిబ్రవరి నెలలొస్తున్నాయంటేనే రైతు కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరిస్తుంటాయి . ఎందుకంటే ఈ రెండు నెలలు వాటి పేర్లలోనే వరి పంటను వెంట పెట్టుకొస్తుంటాయి . 

సహజంగా ఫిబ్రవరి నెల అంటేనే ఓ ప్రత్యేకత ఉంచుకొన్నది మిగిలిన 11 మాసముల (నెలల ) కంటే . 
అది చాలావరకు అందఱికి తెలిసినదే . 
అదేనండి ఈ నెలలో 3 సంవత్సరముల పాటు 28 రోజులే వుంటాయి . ఆ తదుపరి 4 వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలకు 29 రోజులు వుంటాయి . మళ్ళీ తదుపరి సంవత్సరం నుంచి ప్రతి ఫిబ్రవరి నెలకు 28 రోజులు 3 సంవత్సరాల పాటు వుంటాయి .
ఈ ఫిబ్రవరి నెల 29 రోజులనే లీపు సంవత్సరం అంటారు 366 రోజులుంటాయి . మామూలుగా 365 రోజులే వుంటాయి మిగిలిన 3 సంవత్సరాలలో . 

అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మరో ప్రత్యేకత కూడా సంతరించుకొన్నదిట .

అదేమిటంటే ఈ నెలలోని 28 రోజులు 7 వారములని పంచుకొంటాయట . అప్పుడు అన్ని వారములు 4 మార్లు మాత్రం సమానంగా రిపీట్ అవతాయట . 

 క్యాలెండర్ ప్రత్యేకత ప్రతి 823 సంవత్సరాలకొకమారు వస్తుందట . 
ఈ విషయం పవన్ క్రియేటివిటీ వారి ద్వారా తెలియబడింది . 



   
                                                                           
                                                                                 *                         *                          *

మహా శివరాత్రి విశిష్టత


                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి. 

శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు. 

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు.
 ఆ కధ – 
"ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు. ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు. శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.

ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. 

నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

భక్తులు తదనుగుణంగా , తమ వీలు , వసతిని బట్టి నడచుకోవలసినదని మనవి . 


                                                                                *                      *                     *

ఉప వాసము


                                                                                                                                    సేకరణ : శర్మ జి ఎస్

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని , అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని శుక్ల పక్ష శివరాత్రి అంటారు. శుక్ల పక్ష శివరాత్రి నెలకు ఒకసారి మాత్రమే వస్తుంది .

శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి (శ్రీ హరి అని మూడుసార్లు తలచి లేవాలి ఎందుకంటే నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు(జాగ్రదావస్థకు) ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి . ఆయన అనుగ్రహముతో ఆ రోజు కార్యములన్నీ శుభప్రదంగా జరగడాని కొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మతత్వమైన సృష్టికి గుర్తు). నిత్య కర్మానుష్టానములు చేసుకొని శివలింగము నారాధించి, తను చేసే ప్రతి పనిలో , ప్రతి ఒక్కరిలో శివుని చూస్తూ సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన పదార్థములను ప్రసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందుటను గమనిస్తూ శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా జ్ఞానం వైపుకి అడుగులేయడమే ప్రతి రోజు శివరాత్రిగా పేరు గాంచి ప్రసిధ్ధి పొందింది .

ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్లపక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళేసాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈమధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో వున్నట్లు  లేవు , ఉన్నవేమో తెలియరాలేదు .)
ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి అని పిలుస్తారు ఒక రోజులో అసుర సంధ్య వేళ కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈరోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.

అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు. ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము ( ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను మననం చేసుకొంటూ  భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట ).

శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలోఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి ( దీపమును లేదా కర్పూర దీపమునుగాని ) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః , జలేస్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం నీచజన్మభాగినః , భవన్తి త్వం శ్వపచా హి విప్రాః ||

మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు, పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపాన్ని చూస్తూ కూడా చెప్పవలెను)

ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి, కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి జ్యోతి స్వరూపుడైన శివుని దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు .

చివరగా ఓ చిన్న మనవి .

ఏ పూజలూ చేయటానికి వసతి చిక్కలేదే , ఉపవాసాలు వుండే వీలు లేకపోయిందే , నాకెవ్వరూ సహకరించరే అనుకొంటూ ఎందరినో బాధపెట్టి వుండటం కంటే , అసలు ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఆ అతీత శక్తి అయిన ఆ భగవంతుని సాన్నిధ్యంలో గడపటమే అసలైన ఉప వాసము అని గ్రహించి ఆచరించటం ఎంతైనా మంచిది .

ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉపవాసం వుండే అవకాశం వున్నవాళ్ళు తప్పకుండా ఉపవాసం వుండండి , సదా ఆ అతీత శక్తిని స్మరించి తరించండి .


                                                                                 *                         *                    *
  

ప్రేమంటే


                                                                                                                                            శర్మ జి ఎస్
ప్రేమికులారా ,

ఆటే ప్రేమించుకొంటున్నామంటూ కాలుగాలిన పిల్లుల్లా , నిప్పు తొక్కిన కోతుల్లా అటూ యిటూ తిరగకండి . 
అనవసరంగా అందఱి , కళ్ళలో పడకండి . నోళ్ళలో నానకండి . 

అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకొండి .

తెలుసుకోవాలంటే మీరు వెంటనే క్రియేటివ్ కమర్షియల్ బ్యానరు నిర్మించిన " మళ్ళీ మళ్ళీ యిది రాని రోజు " చూడండి . 

చక్కటి , చిక్కటి ప్రేమ కధా చిత్రం . 

చాలా నాళ్ళైంది యింత మంచి చిత్రాన్ని చూసి .

అన్నీ అద్భుతంగా వున్నయి . అందరూ బాగా చేశారు . దర్శకుని ప్రతిభ బాగా కనపడ్తుంది . సంభాషణలు అమోఘం .

బ్రహ్మానందం లేకుండా మనసు పొదిన బ్రహ్మానందం ఈ చిత్రం .

తనువులు కలుసుకొంటేనే ప్రేమ అనుకొనే వారికి ఓ చక్కటి సమాధానమీ చిత్రం . 

                                                                                 *                  *                  *

రూ.300 ల దర్శనమునకు టిక్కెట్లు

                                                                                                                                     సేకరణ : శర్మ జి ఎస్


ఈ క్రింద కనపరచిన పోస్టు ఆపీసులలో ఒక రోజు ముందునుండి 10 AM to 5 PM వరకు కలియుగ  దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనమునకు రూ.300 ల టిక్కెట్లు ఇవ్వబడును .

భక్తులు వినియోగించవలసినదిగా ప్రార్దన.

1. ఆదిలాబాద్                    
2. ఆదోని
3. ఆముదాలవలస
4. ఆవనిగడ్డ
5. ఆమలాపురం
6. ఆర్మూర్ 
7. ఆనకాపల్లి
8. ఆనంతపురం 
9. భొబ్బిలి
10. భద్రాచలం
11. భువనగిరి
12. బంకింగ్ హాంపేట్ 
13. బాపట్ల
14. భీమవరం
15. కడప
16. ఛంద్రగిరి
17. ఛీరాల
18. చిత్తూరు 
19. ధర్మవరం
20. ఏలూరు
21. గూడూరు  
22. గుంటూరు
23. హైదరాబాద్ బి పి ఓ
24. హైదరాబాద్ జూబిలీ హిల్స్ 
25. గుంతకల్
26. గుడివాడ 
27. గద్వాల్
28. హనుమకొండ
29. హిందూపురం
30. హుజూరాబాద్
31. జడ్చర్ల
32. జహీరాబాద్
33. జంగారెడ్డిగూడెం
34. జనగాం
35. జగిత్యాల
36. ఖైరతాబాద్
37. కాచిగూడ 
38. కనిగిరి
39. కామారెడ్డి
40. ఖమ్మం
41. కాకినాడ  
42. కందుకూరు
43. కర్నూలు
44. కరీం నగర్
45. కొత్తగూడెం
46. కావలి
47. కొవ్వూరు
48. మహబూబాబాద్
49. మహబూబానగర్
50. మంచిర్యాల
51. మెదక్
52. మంగళగిరి 
53. మార్కాపురం 
54. మదనపల్లి హెచ్ పి ఓ 
55. మదనపల్లి బజారు వీధి 
56. మచిలీపట్నం
57. మిర్యాలగూడ 
58. నంద్యాల
59. నల్గొండ
60. నెల్లూరు
61. నర్సరావుపేట
62. నర్సీపట్నం
63. నర్సంపేట
64. నూజివీడు
65. నిజామాబాద్
66. ఒంగోలు 
67. పెద్దపల్లి
68. ప్రొద్దుటూరు 
69. పాలకొల్లు
70. పార్వతీపురం
71. పరకాల
72. పులివెందుల
73. రామచంద్రాపురం
74. రాజమండ్రి
75. రాజంపేట
76. రాజోలు
77. సిద్దిపేట 
78. సికింద్రాబాద్
79. శ్రీ కాళహస్తి 
80. సామర్లకోట
81. సంగారెడ్డి
82. సత్తెనపల్లి
83. సూర్యాపేట 
84. శ్రీకాకుళం 
85. తిరుమలగిరి
86. టెక్కలి
87. తణుకు
88. తెనాలి
89. తాడేపల్లిగూడెం
90. తిరుపతి
91. విజయవాడ
92. వికారాబాద్
93. విశాఖపట్నం
94. విజయనగరం
95. వరంగల్
96. వనపర్తి

త్వరలో ప్రారంభించనున్న మరి కొన్ని తపాలా కార్యాలయాలు .


97. తిరుచానూరు , తిరుపతి

98. ఎస్ వి యు క్యాంపస్ ,తిరుపతి.
99. తిరుమల
100. పుత్తూరు
101. పిలేరు  

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు - 2


                                                                                                                           సేకరణ : శర్మ జి ఎస్
                         
భాగవతం, మహాభారతం లోని కొన్నిటికి వివరణలు .

1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం  - దేవ్ ధాం ,నేపాల్
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం  - అహోబిలం , ఆంధ్రప్రదేశ్
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం  - జమానియా , ఉత్తర్ ప్రదేశ్
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని ) - మహేశ్వర్ ,మధ్యప్రదేశ్
5. శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్కమార్లు క్షత్రియులపై దండెత్తి వారిరక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు ) , కురుక్షేత్రం , దుర్యోధనుని చంపిన చోటు -కురుక్షేత్ర , హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలినిసముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి * తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం ) - కేరళ ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం .
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం ) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం ) - గ్వాలియర్ జిల్లా ,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం - ధమౌలి , నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం ) - సీతాపూర్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు - మనగ్రామం , ఉత్తరాంచల్
12. రతిష్టానపురం (పురూరవుని రాజధాని ) - ఝాన్సీ ,అలహాబాద్
13. సాళ్వ రాజ్యం (సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ) - కురుక్షేత్రం దగ్గర
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని ) - హస్తినాపూర్ , ఉత్తర్ ప్రదేశ్
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని ) - మధుర , ఉత్తర్ ప్రదేశ్
16. వ్రేపల్లె / గోకులం  - గోకుల్ , మధుర దగ్గర
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు ) - గ్వాలియర్
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు ) - పంజాబ్ ప్రావిన్స్ , పాకిస్తాన్
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం ) - డెహ్రాడూన్
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు ) - గురుగావ్ , హర్యానా
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్ )
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్ , హస్తినాపూర్
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్ ,గుజరాత్
24. శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక , గుజరాత్
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు ) -జలాన్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం ) - విదర్భ , మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం ) - కుండినపుర , మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం ) - బుందేల్ ఖండ్ , మధ్యప్రదేశ్
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం ) - దాతియ జిల్లా , మధ్యప్రదేశ్
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని ) - ఇంద్రప్రస్థ , ఢిల్లీ దగ్గర
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్ , గుజరాత్
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం ) - ఎటాహ్ , సహజహంపూర్ , ఫారుఖాబాద్ ప్రాంతాలు , ఉత్తర్ ప్రదేశ్
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం ) - కంపిల్ , ఉత్తర్
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి , బీహార్
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు ) - పశ్చిమ హర్యానా
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం ) - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం ,రాజస్థాన్
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం ) - విరాట్ నగర్ , రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని ) - సోనిత్ పూర్ , అస్సాం
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని ) - తేజ్ పూర్ , అస్సాం
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం , సోంనాథ్ , గుజరాత్
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం  - పర్హాం , ఉత్తర్ ప్రదేశ్
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం ) - నేపాల్ లోని తిలార్కోట్
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - బోధ్ గయ , బీహార్
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు - కుశీనగర్ , ఉత్తర్ ప్రదేశ్

గమనిక : ఈ ఎగువ ఉదహరించిన విషయాలు నాకు వాట్సప్ లో ఆదిపూడి వెంకటశివ సాయిరాం నుంచి లభ్యమైనవి .
అందరూ కాకున్నా కొంతమందైనా తెలుసుకుంటారన్న సద్భావనతో ఈ టపాలో పొందుపరచటం జరిగింది .

మినరల్ వాటర్ ప్లీజ్



                                                                                                                            సేకరణ : శర్మ జి ఎస్
పాఠకులారా ,

మీలో చాలామందికి తెలిసిన విషయాలే అయి వుండవచ్చు . కొంతమందికి తెలిసుండకపోవచ్చని భావించి ఈ విషయాలు తెలియచేస్తున్నాను .
అంతే కాకుండా ఎంతమందికి తెలిసినా , యింకా తెలియని వాళ్ళుంటూనే వుంటుంటారు . అందుకే , ఆ తెలియని వాళ్ళ కొఱకే ఈ టపా అనుకోండి .







ఈ టపాలోని విషయాలు వాట్సప్ ద్వారా తిరువళ్ళూరు సుబ్బారావు పంపినవి . 
అవి పాఠకులందరితో షేర్ చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ టపాలో పొందుపరుస్తున్నాను .
వాళ్ళెందుకు అలా చేశారో తెలియకపోవచ్చు గాని , యిలాంటివి మన కంట పడినప్పుడు సందేహించక తప్పదు కదా ! 
పరిశీలించి పర్చేజ్ చేయండి ప్లిజ్ .

ఈతి బాధలు - నీతి బోధలు


                                                                                                                                  సేకరణ : శర్మ జి ఎస్ 



నీతులు ఎవరు చెప్పినా వింటానికి బాగానే వుంటాయి . ఆచరణ విషయానికొస్తేనే అందుకోలేనంత దూరంలో వున్నట్లు అనిపిస్తాయి . 
ఈతి బాధలకు నీతి బోధలు అత్యవసరమైనవి . 
అందుకనే చాలా వరకు ఎక్కడికక్కడ అందరూ చెప్తూనే వున్నారు . విచిత్రమైన విషయమేమిటంటే వినే వారు తగ్గి పోయారు , ఆచరించే వారు అసలు కనపడటం లేదనే చెప్పుకోవాలి .

పాఠాలు కూడా పదే పదే చదివితేనే వస్తాయి కదా !


అయినా ఎందుకు చెప్తున్నానంటే , పలుమార్లు చదవగా , చదవగా కొన్నైనా ఆచరణ అలవాటు చేయగల్గుతాయన్న సదుద్దేశంతోనే ఈ టపా . 

1. నదీ ప్రవాహం విస్తరించాలని ఒడ్డునే కోస్తుంది ఆ ఒడ్డుకే తెలియకుండా . అలాగే శత్రువులను బలహీన పరచాలి    వాళ్ళకు తెలియకుండానే . దెబ్బ తెలియకూడదు . 

2. ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం నిజం చెప్పడం . 
   పాపాల్లోకెల్లా మహాపాపం అబధ్ధం చెప్పడం .

3. మృదువుగా మాట్లాడాలి 
   మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి 
   మృదువుగా హెచ్చరించాలి ( అవసరమైనప్పుడు )
   మృదుత్వాన్ని మించిన పదునైన ఆయుధం లేనే లేదు 
   ( కొన్ని సందర్భాలలో ).

4. తనకు ఉన్నంతలో పదుగురికీ పెట్టి తినేవాడు ,
   ఈ ఇహం లోను , ఆ పరంలోనూ గౌరవం పొందుతాడు .

5. సంపద - స్నేహ సంపద 
   ఈ రెడింటిలోనూ ఏది కావాలని అడిగితే 
   స్నేహమే కోరుకుంటారు విఙ్నులు .

6. ఙ్నానజ్యోతి మనసులోని చీకట్లనూ తొలగిస్తుంది .

7. జీవితం సముద్రమైనప్పుడు 
   చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు 
   అఱి షడ్వర్గాలే మొసళ్ళు 
   ధిర్యమే తెప్ప .

8. క్రోధమే మానవుని పతనానికి తొలి మెట్టు 
   ఆ క్రోధం కారణంగానే 
   కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో 
   రావణుడు రాముడి చేతిలో ఓడిపోయారు .

9. దేశానికి 
   మంచి జరిగినా  
   చెడు జరిగినా 
   పాలకుడిదే పూర్తి బాధ్యత .

10.అహింస - సత్యం - దయ - ఇంద్రియ నిగ్రహం 
   లాంటి వాటికి మించిన తపస్సు లేదు .

11.తీరని అప్పు 
   ఆరని నిప్పు 
   ఎల్ల వేళలా ప్రమాదమే .

12.నాయకుడనేవాడు 
   ముఖస్తుతికి లొంగకూడదు 
   పొగడ్తలతో దగ్గఱ కావాలనుకొనే వారిని 
   ఎల్లవేళలా దూరంగా వుంచాలి .



ఈ భీష్మ నీతి బోధలు తెలుగు వన్స్ వెబ్ సైట్ నుంచి కె . బసంత్ ద్వారా వాట్సప్ లో చూడటం జరిగింది .  

                  *          *          *

ప్రాయాలు - అభిప్రాయాలు



                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్ 

ఈ ప్రపంచంలో  తల్లి తండ్రుల మీద  అభిప్రాయాలు చాలా వరకు ప్రాయానికణుగుణంగా మారుతుంటాయి . స్థిరంగా వుండవు అన్నది నగ్న సత్యమే .

ఓ మారు యివి పరికించి చూడండి . 

1.   4 ఏళ్ళ వయసులో                  మా అమ్మా , నాన్నలు చాలా గొప్పవాళ్ళు .
2.   6 ఏళ్ళ వయసులో                  మా అమ్మా , నాన్నలకు అన్నీ తెలుసు .
3.  12 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు మంచి వాళ్ళే , కాని కోపమెక్కువ .
4.  14 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు చిన్నప్పుడు మాతో బాగా వుండేవారు .
5.  16 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతుంటారు .
6.  18 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలని ఏదడిగినా వద్దంటారు , ఇప్పుడు కాదంటారు .
7.  20 ఏళ్ళ వయసులో                 మా వల్ల కావటం లేదు , ఒకళ్ళనొకళ్ళు ఎలా వేగుతున్నారో .
8.  30 ఏళ్ళ వయసులో                 మా పిల్లల అల్లరి భరించలేక పోతున్నాం . చిన్నప్పుడు మా అమ్మా ,  
                                                నాన్నలకు మేము ఎలా భయపడే వాళ్ళమో .
9.  40 ఏళ్ళ వయసులో                 మా అమ్మా , నాన్నలు మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు . మేమూ మా 
                                                పిల్లల్ని అలాగే పెంచాలి .
10. 50 ఏళ్ళ వయసులో                మనల్ని పెంచటం కొరకు మా అమ్మా , నాన్నలు ఎంత కష్ట పడ్డారో 
                                                ????? తలచుకొంటేనే  ఆశ్ఛర్యమేస్తుంది .
11. 60 ఏళ్ళ వయసులో                 మా అమ్మా నాన్నలు గొప్పవాళ్ళు .

తల్లి తండ్రులను అర్ధం చేసుకోవటానికి  వాళ్ళ పిల్లలకి  56 ఏళ్ళు పడ్తోంది అన్న మాట . 

అందుకే కాబోలు అంటుంటారు . 

అనుభవిస్తే గాని అర్ధం కాదని ,

తలనొప్పి తనదాకా వస్తేనే గాని అర్ధం కాదని ,

ఈ లోగా కొంతమంది తల్లితండ్రులు వాళ్ళను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళి పోవచ్చు . ఇంకొంతమంది ఎదురుగా వున్నా అర్ధం చేసుకోలేక పోవచ్చు . బహు కొద్దిమంది మాత్రమే అర్ధం చేసుకో గలరేమో ? 

                                                                           *                *               *

అవసరాల (లో) అనర్ధాలు


                                                                                                                                    సేకరణ : శర్మ జి ఎస్

తప్పులు ఎక్కువగా తొందరలోనే జరుగుతుంటాయి అదీ చాలా అతి సహజంగా  .

అదే ఈ క్రింద టపా మనకు నిత్యవసరంగా మారిన సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం వున్నదో తెలియచేస్తోంది .
శ్రధ్ధగా పఠించండి . ఆ పరిస్థితి రాకుండా ప్రయత్నించుకోండి , చూసుకోండి . మనలని మనము కాపాడుకున్న వాళ్ళమవుతాము .


                                                     


 *          *         *

స్వైన్ ఫ్లూకి చెక్ ( చిన్ని టపా పెద్దగా ఉపయోగపడ్తుందని )



                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్  

ఎప్పుడైనా ఒంటరిగ వుంటే శక్తి తక్కువేనని , మూకుమ్మడిగా మూడు కలిస్తే శక్తి ఎక్కువేనని వీటి ద్వారా ఋజువవుతున్నది మరల . 

జలుబు - దగ్గు - జ్వరం ల మిశ్రమమే ఈ స్వైన్ ఫ్లూ అట .

దగ్గు వచ్చినా , జలుబు చేసి తుమ్ములొచ్చినా పదిమందిలో లేకున్నా , ఒంటరిగానే వున్నా చేతి రుమాలు అడ్డం పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ముగించాలి . ఎందుకంటే చేతి రుమాలు లేకుండా గనక చేస్తే అది గాలిలో కలసిపోయి వైరస్తో అనుసంధానమై జనసందోహంలోకి చేరిపోయి ఎందఱినో యిబ్బందులకు , వారి ప్రాణాలను సైతం కబళించే అవకాశాలున్నాయట .

అయితే ఈ మూడింటిలోని ఏ ఒక్కదానితో బాధపడ్తున్నా వెంటనే కాకపోయినా 48 గంటల లోపు చికిత్స చేయించుకోవాలట . అందులకు ప్రభుత్వ ఆసుపత్రులే మేలంటున్నది ప్రభుత్వం . వీలుంటే ప్రత్యేకంగా చూసే ప్రైవేటు ఆసుపత్రులు కూడా మంచివే ( ఖర్చులు భరించ గలిగితే ) .

ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా మౌథ్ మాస్కులు ధరించటం చాలా మంచిదట .

కనుక వీలైనంతవరకు పాటించండి . తప్పదు కదా ! ఆరోగ్యమే మహా భాగ్యం కదా ! 

ఈ దిగువ తెలియపరుస్తున్నాను . డాక్టరు గారితో సంప్రదించి ( వాడవచ్చు అంటేనే ) వాడుకోండి .


ARS ALB 200 - 10 Pills for Adults every morning 

ARS ALB 200 - 5 Pills for Childs every morning 

Alternative mornings up to 7 days .

Influenzinium 200 dose - 10 Pills for Adults every morning

Influenzinium 200 dose - 5 Pills for Childs every morning .


స్వైన్ ఫ్లూని అఱి కట్టేటందులకు హోమియోపతిలో మందు ఉన్నదని నాకు వాట్సప్ ( మోహన్ శ్రీనివాసు ) ద్వారా తెలిసింది .
ఈ స్వైన్ ఫ్లూకి యింగ్లీష్ డాక్టర్స్ వ్యాక్సిన్ కూడా చేస్తున్నారు పిన్నలకైనా , పెద్దలకైనా . కేవలం 720 /= లు మాత్రమే . 

ఇంకా ముద్ద కర్పూరం , యాలకుల పొది మిశ్రమంగ కలిపి కొంచెం చేతి రుమాలులో వేసుకొని 2 లేక 3 గంటల కొకమారు వాసన పీల్చిననూ ఈ స్వైన్ ఫ్లూని అఱి కట్టవచ్చుట .


తప్పని సరిగా మాస్కులు ధరించాలట 


తెలుగు టి వి చానల్స్ లో యాడ్ కూడా చూపిస్తున్నారు . 

పదిమందికి ( అవసరమైతే ) ఉపయోగపడ్తుందనే నా బ్లాగు ద్వారా తెలియచేస్తున్నాను . 


                                                                         *        *         *