సేకరణ : శర్మ జి ఎస్
జనవరి , ఫిబ్రవరి నెలలొస్తున్నాయంటేనే రైతు కుటుంబాలలో ఆనందాలు వెల్లి విరిస్తుంటాయి . ఎందుకంటే ఈ రెండు నెలలు వాటి పేర్లలోనే వరి పంటను వెంట పెట్టుకొస్తుంటాయి .
సహజంగా ఫిబ్రవరి నెల అంటేనే ఓ ప్రత్యేకత ఉంచుకొన్నది మిగిలిన 11 మాసముల (నెలల ) కంటే .
అది చాలావరకు అందఱికి తెలిసినదే .
అదేనండి ఈ నెలలో 3 సంవత్సరముల పాటు 28 రోజులే వుంటాయి . ఆ తదుపరి 4 వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలకు 29 రోజులు వుంటాయి . మళ్ళీ తదుపరి సంవత్సరం నుంచి ప్రతి ఫిబ్రవరి నెలకు 28 రోజులు 3 సంవత్సరాల పాటు వుంటాయి .
ఈ ఫిబ్రవరి నెల 29 రోజులనే లీపు సంవత్సరం అంటారు 366 రోజులుంటాయి . మామూలుగా 365 రోజులే వుంటాయి మిగిలిన 3 సంవత్సరాలలో .
అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మరో ప్రత్యేకత కూడా సంతరించుకొన్నదిట .
అదేమిటంటే ఈ నెలలోని 28 రోజులు 7 వారములని పంచుకొంటాయట . అప్పుడు అన్ని వారములు 4 మార్లు మాత్రం సమానంగా రిపీట్ అవతాయట .
ఈ క్యాలెండర్ ప్రత్యేకత ప్రతి 823 సంవత్సరాలకొకమారు వస్తుందట .
ఈ విషయం పవన్ క్రియేటివిటీ వారి ద్వారా తెలియబడింది .
* * *
No comments:
Post a Comment