సేకరణ : శర్మ జి ఎస్
నీతులు ఎవరు చెప్పినా వింటానికి బాగానే వుంటాయి . ఆచరణ విషయానికొస్తేనే అందుకోలేనంత దూరంలో వున్నట్లు అనిపిస్తాయి .
ఈతి బాధలకు నీతి బోధలు అత్యవసరమైనవి .
అందుకనే చాలా వరకు ఎక్కడికక్కడ అందరూ చెప్తూనే వున్నారు . విచిత్రమైన విషయమేమిటంటే వినే వారు తగ్గి పోయారు , ఆచరించే వారు అసలు కనపడటం లేదనే చెప్పుకోవాలి .
పాఠాలు కూడా పదే పదే చదివితేనే వస్తాయి కదా !
అయినా ఎందుకు చెప్తున్నానంటే , పలుమార్లు చదవగా , చదవగా కొన్నైనా ఆచరణ అలవాటు చేయగల్గుతాయన్న సదుద్దేశంతోనే ఈ టపా .
ఈతి బాధలకు నీతి బోధలు అత్యవసరమైనవి .
అందుకనే చాలా వరకు ఎక్కడికక్కడ అందరూ చెప్తూనే వున్నారు . విచిత్రమైన విషయమేమిటంటే వినే వారు తగ్గి పోయారు , ఆచరించే వారు అసలు కనపడటం లేదనే చెప్పుకోవాలి .
పాఠాలు కూడా పదే పదే చదివితేనే వస్తాయి కదా !
అయినా ఎందుకు చెప్తున్నానంటే , పలుమార్లు చదవగా , చదవగా కొన్నైనా ఆచరణ అలవాటు చేయగల్గుతాయన్న సదుద్దేశంతోనే ఈ టపా .
1. నదీ ప్రవాహం విస్తరించాలని ఒడ్డునే కోస్తుంది ఆ ఒడ్డుకే తెలియకుండా . అలాగే శత్రువులను బలహీన పరచాలి వాళ్ళకు తెలియకుండానే . దెబ్బ తెలియకూడదు .
2. ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం నిజం చెప్పడం .
పాపాల్లోకెల్లా మహాపాపం అబధ్ధం చెప్పడం .
3. మృదువుగా మాట్లాడాలి
మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి
మృదువుగా హెచ్చరించాలి ( అవసరమైనప్పుడు )
మృదుత్వాన్ని మించిన పదునైన ఆయుధం లేనే లేదు
( కొన్ని సందర్భాలలో ).
4. తనకు ఉన్నంతలో పదుగురికీ పెట్టి తినేవాడు ,
ఈ ఇహం లోను , ఆ పరంలోనూ గౌరవం పొందుతాడు .
5. సంపద - స్నేహ సంపద
ఈ రెడింటిలోనూ ఏది కావాలని అడిగితే
స్నేహమే కోరుకుంటారు విఙ్నులు .
6. ఙ్నానజ్యోతి మనసులోని చీకట్లనూ తొలగిస్తుంది .
7. జీవితం సముద్రమైనప్పుడు
చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు
అఱి షడ్వర్గాలే మొసళ్ళు
ధిర్యమే తెప్ప .
8. క్రోధమే మానవుని పతనానికి తొలి మెట్టు
ఆ క్రోధం కారణంగానే
కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో
రావణుడు రాముడి చేతిలో ఓడిపోయారు .
9. దేశానికి
మంచి జరిగినా
చెడు జరిగినా
పాలకుడిదే పూర్తి బాధ్యత .
10.అహింస - సత్యం - దయ - ఇంద్రియ నిగ్రహం
లాంటి వాటికి మించిన తపస్సు లేదు .
11.తీరని అప్పు
ఆరని నిప్పు
ఎల్ల వేళలా ప్రమాదమే .
12.నాయకుడనేవాడు
ముఖస్తుతికి లొంగకూడదు
పొగడ్తలతో దగ్గఱ కావాలనుకొనే వారిని
ఎల్లవేళలా దూరంగా వుంచాలి .
ఈ భీష్మ నీతి బోధలు తెలుగు వన్స్ వెబ్ సైట్ నుంచి కె . బసంత్ ద్వారా వాట్సప్ లో చూడటం జరిగింది .
* * *
No comments:
Post a Comment