సేకరణ : శర్మ జి ఎస్
ఈ ప్రపంచంలో తల్లి తండ్రుల మీద అభిప్రాయాలు చాలా వరకు ప్రాయానికణుగుణంగా మారుతుంటాయి . స్థిరంగా వుండవు అన్నది నగ్న సత్యమే .
ఓ మారు యివి పరికించి చూడండి .
1. 4 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలు చాలా గొప్పవాళ్ళు .
2. 6 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలకు అన్నీ తెలుసు .
3. 12 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలు మంచి వాళ్ళే , కాని కోపమెక్కువ .
4. 14 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలు చిన్నప్పుడు మాతో బాగా వుండేవారు .
5. 16 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతుంటారు .
6. 18 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలని ఏదడిగినా వద్దంటారు , ఇప్పుడు కాదంటారు .
7. 20 ఏళ్ళ వయసులో మా వల్ల కావటం లేదు , ఒకళ్ళనొకళ్ళు ఎలా వేగుతున్నారో .
8. 30 ఏళ్ళ వయసులో మా పిల్లల అల్లరి భరించలేక పోతున్నాం . చిన్నప్పుడు మా అమ్మా ,
నాన్నలకు మేము ఎలా భయపడే వాళ్ళమో .
9. 40 ఏళ్ళ వయసులో మా అమ్మా , నాన్నలు మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు . మేమూ మా
పిల్లల్ని అలాగే పెంచాలి .
10. 50 ఏళ్ళ వయసులో మనల్ని పెంచటం కొరకు మా అమ్మా , నాన్నలు ఎంత కష్ట పడ్డారో
????? తలచుకొంటేనే ఆశ్ఛర్యమేస్తుంది .
11. 60 ఏళ్ళ వయసులో మా అమ్మా నాన్నలు గొప్పవాళ్ళు .
తల్లి తండ్రులను అర్ధం చేసుకోవటానికి వాళ్ళ పిల్లలకి 56 ఏళ్ళు పడ్తోంది అన్న మాట .
అందుకే కాబోలు అంటుంటారు .
అనుభవిస్తే గాని అర్ధం కాదని ,
తలనొప్పి తనదాకా వస్తేనే గాని అర్ధం కాదని ,
ఈ లోగా కొంతమంది తల్లితండ్రులు వాళ్ళను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళి పోవచ్చు . ఇంకొంతమంది ఎదురుగా వున్నా అర్ధం చేసుకోలేక పోవచ్చు . బహు కొద్దిమంది మాత్రమే అర్ధం చేసుకో గలరేమో ?
* * *
No comments:
Post a Comment