శర్మ జి ఎస్
ప్రేమికులారా ,
ఆటే ప్రేమించుకొంటున్నామంటూ కాలుగాలిన పిల్లుల్లా , నిప్పు తొక్కిన కోతుల్లా అటూ యిటూ తిరగకండి .
అనవసరంగా అందఱి , కళ్ళలో పడకండి . నోళ్ళలో నానకండి .
అసలు ప్రేమంటే ఏంటో తెలుసుకొండి .
తెలుసుకోవాలంటే మీరు వెంటనే క్రియేటివ్ కమర్షియల్ బ్యానరు నిర్మించిన " మళ్ళీ మళ్ళీ యిది రాని రోజు " చూడండి .
చక్కటి , చిక్కటి ప్రేమ కధా చిత్రం .
చాలా నాళ్ళైంది యింత మంచి చిత్రాన్ని చూసి .
అన్నీ అద్భుతంగా వున్నయి . అందరూ బాగా చేశారు . దర్శకుని ప్రతిభ బాగా కనపడ్తుంది . సంభాషణలు అమోఘం .
బ్రహ్మానందం లేకుండా మనసు పొదిన బ్రహ్మానందం ఈ చిత్రం .
తనువులు కలుసుకొంటేనే ప్రేమ అనుకొనే వారికి ఓ చక్కటి సమాధానమీ చిత్రం .
* * *
వాహ్...ఏం చెప్పారండి :-)
ReplyDelete