ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా....?

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్



అసలు దణ్ణం ఎందుకు పెట్టుకోవాలి అని ప్రశ్నించే ఈ రోజుల్లో , దేవుళ్ళకు ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా అన్న సందేహం చాలా మందిలో లేకపోయినా , ఆ సందేహాన్ని నిస్సందేహంగా జనాల మనసుల్లోకి అతి సులువుగా ఎక్కించేస్తుంటారు .


అసలు దేవుళ్ళ వద్దకు ఎందుకు వెళ్తారు , ఎవరు వెళ్తారు అంటే ? 

కష్టాలలో వున్నవాళ్ళు తమ తమ అభీష్టాలను ఆ దేవుళ్ళకు విన్నవించుకొని ఆ గండాల నుండి గట్టెక్కాలనే చెప్పుకోవాలి . 

ఈ జగత్తును పాలించే ఆ దేవుని దర్శించాలని వెళ్ళే వాళ్ళు ( ఎవరైనా గాని ) , ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్క రించాలే తప్ప ఆ పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.



దేవుళ్ళు అంటే మన కష్టాలను తొలగించి , మన యిష్టాలను ఆలకించి ఆదరించేవారని .

అందుకనే అన్ని దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. 
దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదాలు కూడా చెప్తున్నాయి .

ఎందుకంటే ,


దేవుళ్ళ  విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున ఆ విగ్రహాల కళ్ళకు మైనం పెడతారు . ఆ తదుపరి విగ్రహం ప్రతిష్ట జరిగాక ఆ దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింగానే స్వామి వారి దృష్టి మొదట ఆ విగ్రహనికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఆవు దూడపై పడేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారు తన రూపాన్ని తను అద్దం లో చూసుకోనేలా చేస్తారు .అటు పిమ్మట స్వామి వారికి మహా నివేదన ఏర్పాటు చేసి అయన దృష్టి ఆ నివేదన మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి దృష్టి సరాసరి ధ్వజస్తంభం క్రింద ఉన్న తన ప్రతిబింబం మీద పడాలి . వారిద్దరి నడుమ వేరెవ్వరూ నిలబడ కూడదు.  విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ...ఏ రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదనే దేవుని ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోకూడదని అంటారు.


ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించు కోవాలి .


వాస్తవానికి ఈ ప్రపంచం పంచన వుంటున్న ఆ నవగ్రహాలను కూడా , దేవుళ్ళుగానే భావిస్తారు . ఎందుకంటే ఆ గ్రహాల ప్రభావం , ఆ ప్రపంచంలోనే జీవిస్తున్న ఈ మానవుల మీద పడటం వల్లనే , ఈ ఈతిబాధలు కలుగుతున్నాయని భావించి , ఆ గ్రహాల ఆగ్రహాలకు గురి కాకుండా , ఆ గ్రహాలను కూడా ఆ దేవుళ్ళ కోవలోనే చేర్చారు . పూజలు ప్రారంభించారు .


శనికి తప్ప మిగిలిన అన్ని దేవుళ్ళకి  ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు . 

కాని ,
శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి మనమే ప్రక్కకు వెళ్లిపోవాలి .
అయ్యా శనిదేవుడా , నన్ను ఓ పట్టు పట్టి నీ వద్దకు రప్పించుకోవటం వల్ల ,తప్పని సరి నీ వద్దకు  వస్తే నీవు నన్ను వదలిపెడ్తానంటే వచ్చాం . ఇంకా నీ ఎదురుగా ఎందుకు నిలబడ్తామయ్యా బాబూ అని మనసులోనే అనుకొంటూ వెంటనే వెళ్ళిపోవాలట అక్కడ నుంచి .  

                                                                              ********************

2 comments: