సమాజం లోని నక్సలైట్లు

                                                                                                                                 సేకరణ : శర్మ జి ఎస్


వేసవికాలం వస్తున్నదని తలచుకొనగానే గతంలోని ఉష్ణొగ్రతలు , వడ గాడ్పులు , వాటి తీవ్రత దానివలన ఎంతమంది నిర్జీవులయ్యారో , మరెంతమంది నిరాశ్రయులయ్యారో మనకు ఙ్నప్తికి వస్తుంటాయి . రాకున్నా కొంతమంది వలన గాని , కొన్ని సంఘటనల వలన గాని తప్పక ఙ్నప్తికి వచ్చి తీరుతాయి .

ఇదే సమయంలో కాలానుగుణంగా చేసే వ్యాపారులకు ఇదో మాంఛి సీజననే చెప్పుకోవచ్చు .

వేసవి కాలమనగానే వసంత ఋతువు కొత్త పంటలను అందిస్తుంది .

ఒక వైపు హాయిగా మామిడి పండ్ల లోని అన్ని రకాలను ఎంచక్కా తినవచ్చు అనుకొనే వాళ్ళో వైపు వుండగా , వీళ్ళను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే వ్యాపారులు మఱో వైపు , కల్తీలతో ఎక్కువ క్యాష్ చేసుకోవాలనే మోసపూరిత వ్యాపారులింకో వైపు ఉబలాట పడ్తుంటారు .

సాటి మానవులు తినే ఆహారంలో కల్తీ చేస్తున్నారంటే వాళ్ళు మానవులు కాదు , మానవ రూపంలో వున్న దానవులని చెప్పుకోవలసిందే .
ఆ కల్తీ చేసే వాళ్ళు ఎంత కాలమో బ్రతకరు . ఆ కొంత కాలాని కొరకు తోటి మానవులను మట్టుబెట్టజూస్తున్న వీళ్ళు నక్సలైట్లు , మిలిటెంట్స్ , ఐ ఎస్ ఐ మొదలగు తీవ్రవాదుల కంటే , ఘోరమైన వాళ్ళు .
ఈ పైన చెప్పిన అతీవ్రవాదులు ఎక్కడో వుండి అదను కొరకు ఎదురు చూస్తుంటారు . కాని ఈ కల్తీ వ్యాపారులు మనతోనే వుంటూ , మనకు సాయం చేస్తున్నట్లు కనపడ్తూ , మనలని మెల్ల మెల్లగా మట్టుపెట్టేవాళ్ళున్నారు .

ఉదా : ఈ వీడియో లింకు చూడండి .

 https://www.youtube.com/watch?v=GUvOjO8mU5E                                                  

 అన్ని ఆహారాలలోను కల్తీకి అలవాటు పడ్డారు సునాయాసంగా ధనం సంపాదించేటందులకు ..
వీళ్ళ ధన దాహార్తికి ఎంతమంది బలి అవుతున్నారో వయసు తారతమ్యం లేకుండా .
ఈ వేసవి కాలపు ఆనందం మంచు కరగి మాయమైనట్లు ఎందరి జీవితాలో మాయమై పోతున్నాయి వీళ్ళ కల్తీ అకృత్యాల వలన .

ఈ కల్తీని కనిపెట్టేందులకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి . ప్రతి వ్యాపారస్తుడికి అమ్మకపు లైసెన్సులు యివ్వాలి . ఏదైనా తేడా వస్తే ఆ వ్యాపారస్తుడు అందులకు బాధ్యత వహించాలి . అందులకు అతను శిక్ష అమ్నుభవింఛాలి .

పొరుగు దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి రావటం కాదు మన ప్రభుత్వాధికారులకు , వాళ్ళ నుంచి ఎంత మంచి మంచి విషయాలు తెలుసుకొని మన ప్రభుత్వాలు అమలు పరిచే దిశలో అడుగులు వేస్తే , యిప్పటికిప్పుడు కాకపోయినా , ఇంకొన్నాళ్ళకైనా మనమే కాదు , మన దేశం కూడా ఆరోగ్యవంతంగా వుంటుంది . అప్పుడే అగ్ర దేశాలకు దీటుగా నిలబడ్తుంది .

                                                                                  *                       *                    *

1 comment:

  1. Well said. People come before TV cameras and talk so much about corruption. But whether anybody has reported their own relatives resorting to this kind of anti social activities.

    ReplyDelete