ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు - 2


                                                                                                                           సేకరణ : శర్మ జి ఎస్
                         
భాగవతం, మహాభారతం లోని కొన్నిటికి వివరణలు .

1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం  - దేవ్ ధాం ,నేపాల్
2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం  - అహోబిలం , ఆంధ్రప్రదేశ్
3. జమదగ్ని మహర్షి ఆశ్రమం  - జమానియా , ఉత్తర్ ప్రదేశ్
4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని ) - మహేశ్వర్ ,మధ్యప్రదేశ్
5. శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్కమార్లు క్షత్రియులపై దండెత్తి వారిరక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు ) , కురుక్షేత్రం , దుర్యోధనుని చంపిన చోటు -కురుక్షేత్ర , హర్యానా
6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలినిసముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి * తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం ) - కేరళ ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం .
7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం ) - పశ్చిమ ఒరిస్సా
8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం ) - గ్వాలియర్ జిల్లా ,మధ్యప్రదేశ్
9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం - ధమౌలి , నేపాల్
10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం ) - సీతాపూర్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్
11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు - మనగ్రామం , ఉత్తరాంచల్
12. రతిష్టానపురం (పురూరవుని రాజధాని ) - ఝాన్సీ ,అలహాబాద్
13. సాళ్వ రాజ్యం (సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ) - కురుక్షేత్రం దగ్గర
14. హస్తినాపురం (కౌరవుల రాజధాని ) - హస్తినాపూర్ , ఉత్తర్ ప్రదేశ్
15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని ) - మధుర , ఉత్తర్ ప్రదేశ్
16. వ్రేపల్లె / గోకులం  - గోకుల్ , మధుర దగ్గర
17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు ) - గ్వాలియర్
18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు ) - పంజాబ్ ప్రావిన్స్ , పాకిస్తాన్
19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం ) - డెహ్రాడూన్
20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు ) - గురుగావ్ , హర్యానా
21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్ )
22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్ , హస్తినాపూర్
23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్ ,గుజరాత్
24. శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక , గుజరాత్
25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు ) -జలాన్ జిల్లా , ఉత్తర్ ప్రదేశ్
26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం ) - విదర్భ , మహరాష్ట్ర
27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం ) - కుండినపుర , మహరాష్ట్ర
28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం ) - బుందేల్ ఖండ్ , మధ్యప్రదేశ్
29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం ) - దాతియ జిల్లా , మధ్యప్రదేశ్
30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని ) - ఇంద్రప్రస్థ , ఢిల్లీ దగ్గర
31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్ , గుజరాత్
32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం ) - ఎటాహ్ , సహజహంపూర్ , ఫారుఖాబాద్ ప్రాంతాలు , ఉత్తర్ ప్రదేశ్
33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం ) - కంపిల్ , ఉత్తర్
34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి , బీహార్
35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు ) - పశ్చిమ హర్యానా
36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం ) - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం ,రాజస్థాన్
37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం ) - విరాట్ నగర్ , రాజస్థాన్
38. శోణపురం (బాణాసురుడి రాజధాని ) - సోనిత్ పూర్ , అస్సాం
39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని ) - తేజ్ పూర్ , అస్సాం
40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం , సోంనాథ్ , గుజరాత్
41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం  - పర్హాం , ఉత్తర్ ప్రదేశ్
42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం ) - నేపాల్ లోని తిలార్కోట్
43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - బోధ్ గయ , బీహార్
44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు - కుశీనగర్ , ఉత్తర్ ప్రదేశ్

గమనిక : ఈ ఎగువ ఉదహరించిన విషయాలు నాకు వాట్సప్ లో ఆదిపూడి వెంకటశివ సాయిరాం నుంచి లభ్యమైనవి .
అందరూ కాకున్నా కొంతమందైనా తెలుసుకుంటారన్న సద్భావనతో ఈ టపాలో పొందుపరచటం జరిగింది .

1 comment:

  1. Sarma Garu, Good Information but please correct about the Anga Kingdom:

    I) Karanas Kingdom Anga = Angas (eastern Bihar, Jharkhand and West Bengal), Vangas (southern West Bengal and Bangladesh), Kalingas (Coastal Orissa), Pundras (Northern Bangladesh and West Bengal, India) and Suhmas (north-western Bangladesh and West Bengal, India) shared a common ancestry. Source: https://en.wikipedia.org/wiki/Anga_Kingdom.

    II) Some intersting information regarding Gajendra Moksha Places? =

    1) It is believed that this incident has happened in Srirangam. There is a Temple Devoted to Lord Vishnu known as Sri Ranganathaswamy Temple, Srirangam at the banks of Kaveri. Source: https://en.wikipedia.org/wiki/Gajendra_Moksha
    2) Kapisthalam, near Kumbakonam in Tamilnadu. This place is now the temple tank of Gajendra Varadaraja Perumal temple?- Source: http://templesoftamilnadu.co.in/gajendravaradhar-temple-kapisthalam/
    3) Enugu Rayi konda (Possible Ancient Buddhist Site) - (Elephant Stone Hill) - It is believed that this is the place where "Gajendra Moksha" occured.A huge stone resembling an elephant is a token of Gajendra moksha as per local belief - Polavaram Tourist Hub - Nearby: Rajahmundry, Kovvuru, Nidadavolu - http://wikimapia.org/1400157/Enugu-Rayi-konda-Possible-Ancient-Buddhist-Site.
    4) Chakra Nrusingha Temple, Puri, Orissa - Gajendra Moksha has taken place here. Lord Vishnu has rescued elephant from the clutches of crocodile. Sudarshan chakra is the presiding deity of this temple. The image of Narasingha is circled with a ring close by in a modern structure is the representation of the celestial wheel Chakranarayana. Source: http://samsepuja.in/about-puri.php
    5) Devdham, Nepal. Source: http://www.nepalpilgrimtravel.com/hindu_pilgrimage_info.asp
    6) Gajendra Moksha took place on the convergence of the scared rivers Ganges and Gandak at Sonepur, Bihar (Hariharnath Temple). Thousands of devotees visit the temple especially during the Sonepur Mela. Source: http://www.hindu-blog.com/2015/04/hariharnath-temple-at-sonepur-in-bihar.html
    7) Aadi Moolam Gajendra Varadan Temple, Athalanallur, near Veeravanallur, Ambasamudram, Tirunelveli, Tamil Nadu, The site where Vishnu saved the elephant Gajendra from the crocodile. Source: http://indiancolumbus.blogspot.com/2014/07/athanallur-aadi-moolam-gajendra-varadan.html
    8)Ashtabhuyakaram, Adikesava Perumal (Ashtabhuja Perumaal) & Taayaar: Alarmelmangai (Padmasini), Gajendra Pushkarini Theertham, Kanchipuram. This temple is associated with the legend of Gajendra Moksham. Source: http://templenet.com/Tamilnadu/df044.html

    III) Narasimha Avatara Place: Several Temples Ahobilam (Anantapur & Kadapa), Kadiri, Mangala Giri, Yada Giri Gutta, Dharmapuri, Antarvedi, Simahachalam located in AP, Telangana & Karanataka, Tamil Nadu etc..,

    ReplyDelete