స్వైన్ ఫ్లూకి చెక్ ( చిన్ని టపా పెద్దగా ఉపయోగపడ్తుందని )



                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్  

ఎప్పుడైనా ఒంటరిగ వుంటే శక్తి తక్కువేనని , మూకుమ్మడిగా మూడు కలిస్తే శక్తి ఎక్కువేనని వీటి ద్వారా ఋజువవుతున్నది మరల . 

జలుబు - దగ్గు - జ్వరం ల మిశ్రమమే ఈ స్వైన్ ఫ్లూ అట .

దగ్గు వచ్చినా , జలుబు చేసి తుమ్ములొచ్చినా పదిమందిలో లేకున్నా , ఒంటరిగానే వున్నా చేతి రుమాలు అడ్డం పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ముగించాలి . ఎందుకంటే చేతి రుమాలు లేకుండా గనక చేస్తే అది గాలిలో కలసిపోయి వైరస్తో అనుసంధానమై జనసందోహంలోకి చేరిపోయి ఎందఱినో యిబ్బందులకు , వారి ప్రాణాలను సైతం కబళించే అవకాశాలున్నాయట .

అయితే ఈ మూడింటిలోని ఏ ఒక్కదానితో బాధపడ్తున్నా వెంటనే కాకపోయినా 48 గంటల లోపు చికిత్స చేయించుకోవాలట . అందులకు ప్రభుత్వ ఆసుపత్రులే మేలంటున్నది ప్రభుత్వం . వీలుంటే ప్రత్యేకంగా చూసే ప్రైవేటు ఆసుపత్రులు కూడా మంచివే ( ఖర్చులు భరించ గలిగితే ) .

ఇంటినుంచి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా మౌథ్ మాస్కులు ధరించటం చాలా మంచిదట .

కనుక వీలైనంతవరకు పాటించండి . తప్పదు కదా ! ఆరోగ్యమే మహా భాగ్యం కదా ! 

ఈ దిగువ తెలియపరుస్తున్నాను . డాక్టరు గారితో సంప్రదించి ( వాడవచ్చు అంటేనే ) వాడుకోండి .


ARS ALB 200 - 10 Pills for Adults every morning 

ARS ALB 200 - 5 Pills for Childs every morning 

Alternative mornings up to 7 days .

Influenzinium 200 dose - 10 Pills for Adults every morning

Influenzinium 200 dose - 5 Pills for Childs every morning .


స్వైన్ ఫ్లూని అఱి కట్టేటందులకు హోమియోపతిలో మందు ఉన్నదని నాకు వాట్సప్ ( మోహన్ శ్రీనివాసు ) ద్వారా తెలిసింది .
ఈ స్వైన్ ఫ్లూకి యింగ్లీష్ డాక్టర్స్ వ్యాక్సిన్ కూడా చేస్తున్నారు పిన్నలకైనా , పెద్దలకైనా . కేవలం 720 /= లు మాత్రమే . 

ఇంకా ముద్ద కర్పూరం , యాలకుల పొది మిశ్రమంగ కలిపి కొంచెం చేతి రుమాలులో వేసుకొని 2 లేక 3 గంటల కొకమారు వాసన పీల్చిననూ ఈ స్వైన్ ఫ్లూని అఱి కట్టవచ్చుట .


తప్పని సరిగా మాస్కులు ధరించాలట 


తెలుగు టి వి చానల్స్ లో యాడ్ కూడా చూపిస్తున్నారు . 

పదిమందికి ( అవసరమైతే ) ఉపయోగపడ్తుందనే నా బ్లాగు ద్వారా తెలియచేస్తున్నాను . 


                                                                         *        *         *

No comments:

Post a Comment